Arekapudi Gandhi : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళతానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముందే ప్రకటించినట్లుగా తన అనుచరులతో కలిసి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఆయనపై కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంట్లో పనిచేసే వారికి గాయాలయ్యాయి. పలువురు మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. పోలీసులు గాంధీ అనుచరులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.