Gill : నువ్వు మరీ ఇంత స్వార్థపరుడివా.. గిల్ ఆటతీరుపై నెట్టింట విమర్శలు

Gill

Gill

Gill : షుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని  టీమిండియా, జింబాబ్వేతో జరిగిన  టీ20 సిరిస్ ను 3-1తో కైవసం చేసుకుంది. 5-మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న టీమిండియా  తదుపరి మ్యాచ్ లలో వరుస విజయాలతో సిరిస్ ను కైవం చేసుకుంది. నాలుగో మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందగా, అదే సమయంలో టీ20 ఇంటర్నేషనల్‌లో పాక్ జట్టు ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది,

ప్రత్యర్థి జట్టు సొంతగడ్డపై భారత జట్టు 50వ విజయం
టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచి టీమిండియా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. జింబాబ్వేతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలవడం ద్వారా ప్రత్యర్థి జట్టు స్వదేశంలో వారి 50వ టీ20 అంతర్జాతీయ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు  ఈ రికార్డును పాకిస్థాన్ కలిగి ఉండగా, టీమిండియా సమం చేసింది.  భారత జట్టు 81మ్యాచ్ లో ఈ రికార్డను సాధించగా, పాకిస్థాన్ జట్టు 95 మ్యాచ్‌లు ఆడి 50 విజయాలు సాధించింది.

గిల్, యశస్వీ దాడి
శుభ్‌మన్‌ గిల్‌, యశస్వీ జైస్వాల్‌ జింబాబ్వేపై తమ బ్యాటింగ్ తో దాడికి దిగారు. ఈ మ్యాచ్‌లో యశస్వి, శుభ్‌మన్ ఇద్దరూ చివరి వరకు బ్యాటింగ్ చేసి నాటౌట్‌గా నిలిచారు.  ఈ విజయంతో సిరీస్‌లో టీమ్‌ఇండియా 3-1తో తిరుగులేని ఆధిక్యంలోకి చేరుకున్నప్పటికి  కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

యశస్వి 53 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేశాడు. యశస్వికి తన రెండో టీ20 సెంచరీని పూర్తి చేసే అవకాశం లభించింది. యశస్వీ 83 పరుగుల వద్ద ఉండగా, శుభ్‌మాన్   అతనికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా రెండు సిక్స్ లు కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  యశస్వి   సెంచరీ పూర్తి చేయకపోవడానికి కారణం గిల్ కారణమంటూ నెట్టింట్లో దుమ్మెత్తిపోస్తున్నారు. స్వార్థపరుడంటూ ఆడిపోసుకుంటున్నారు.  యశస్వి 83 పరుగుల స్కోరుకు చేరుకున్నప్పుడు, టీమ్ ఇండియా విజయానికి 23 పరుగులు కావాల్సి ఉండగా, యశస్వి సెంచరీకి 17 పరుగులు మాత్రమే అవసరం. ఈ సమయంలో శుభమాన్ గిల్ యశస్వికి స్ట్రైకింగ్ ఇస్తూ ఉంటే, అతను తన సెంచరీని పూర్తి చేసేవాడు. కానీ అది జరగలేదు. అయితే, దీనిని శుభ్‌మన్ గిల్ తప్పుగా పరిగణించలేము. ఆటగాడిగా, జట్టు విజయం, వ్యక్తిగత మైలురాయిని మొదటగా చూస్తారు, కానీ క్రికెట్ అభిమానులు తమ కోపాన్ని వ్యక్తం చేయడం వల్ల తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నారు.

TAGS