JAISW News Telugu

abortion : ఇంతకు తెగబడ్డార్రా.. ఇంట్లోనే మీరే అబార్షన్ చేయడం ఏంట్రా..?

abortion

abortion

abortion at home : ఇప్పటికీ మహిళన ఒక ఆట వస్తువుగా చూసే వారు చాలా మందే ఉన్నారని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. ఇలా ఎంత మందిని అత్తింటి వారు చిదిమేస్తున్నారన్న దానిపై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ మొదలైంది. అసలు వైద్యానికి సంబంధమే లేని ఇద్దరు పాపం ఆమెకు అబార్షన్ చేశారు. తీవ్ర రక్తశ్రావం అయిన యువతి మరణించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. పూణెకు చెందిన 24 ఏళ్ల మహిళకు అత్తింటి వారు ఇంట్లో రహస్యంగా అబార్షన్ చేయించారు. అత్తగారిపై కేసు నమోదు చేయగా, ఆమె భర్త, మామలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల పిండాన్ని కుటుంబీకుల పొలంలో పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. అబార్షన్ చేసేందుకు పిలిచిన ఓ ప్రైవేట్ వైద్యుడిని కూడా పోలీసులు విచారించారు.

2017లో మహిళకు వివాహం జరిగింది. ఇది ఆమెకు మూడో గర్భం. పిండంలో ఆడ శిశువు ఉందని ఈ ఘాతుకానికి ఒడికంటి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ సోదరుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో ఇంకా ఇలాంటి వారు ఉన్నారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version