JAISW News Telugu

Nara Lokesh : మీరు పోలీసులా?..జగన్ కిరాయి సైన్యమా? లోకేశ్ 

FacebookXLinkedinWhatsapp
Nara lokesh

Nara lokesh tweet

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా పాల్తూరు పోలీస్ స్టేషన్ లో చంద్రమోహన్ అనే టిడిపి కార్యకర్తలు కొడుతూ నగ్నంగా తిప్పిన ఘటనపై నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ ఘోరం చూశాక నా గుండె చెదిరిపోయిందని మీరు పోలీసుల? లేక ఫ్యాక్ష నిస్టు జగన్ కిరాయి సైన్యమా?  అంటూ లోకేష్ మండిపడ్డారు. రానున్న రోజుల్లో చట్టబద్ధమైన శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి అని పోలీసులను లోకేష్ హెచ్చరించారు.

తప్పు చేశాడా లేదా అని చూడకుండా వైసిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల నారా లోకేష్ తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా చట్ట వ్యతిరేక విధానాలకు ఎలా పాల్పడతారని రానున్న రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని లోకేష్ పోలీస్ లను హెచ్చరించారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే చట్టప రంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఇష్టం వచ్చి నట్లు వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో చట్టబద్ధమైన శిక్ష అనుభవించేందుకు సిద్ధపడాలని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version