Marriage : మీకు పెండ్లయ్యిందా.. అయితే ఈ 45 వేలు మీవే.. ఎలానంటే..?
Marriage : పెళ్లైన వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వ పథకంలో మీ భార్యపేరరిట ఖాతా తీసుకొని పెట్టుబడి పెడితే నెలకు 45 వేల వరకు పొందొచ్చు. ఈ పథకం వివరాలెంటో తెలుసుకుందాం.. ప్రస్తుతం ఏ పని కావాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది.. అందరూ ఆదాయమార్గాల కోసం వెతుకులాటలో ఉన్నారు.. భవిష్యత్తులో వచ్చే ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే మనం సంపాదించే దానిలో కొంత పొదుపు చేయకపోతే భవిష్యత్లో మాత్రం కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో నే ఈ కేంద్ర పథకం ఉపయోగకరంగా ఉంది. నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా మీ భార్య పేరిట అకౌంట్ తెరిచి పొదుపు చేస్తే ప్రతి నెల ఆదాయం మీకు అందుతుంది. ఏకంగా నెలకు 45 వేల వరకు పొందవచ్చు..ఇప్పుడు పొదుపు చేస్తే 60 ఏళ్ల తర్వాత నెలనెల మీకు ఆదాయం అందుతుంది.. రెగ్యులర్ గా ఈ ఆదాయం పొందవచ్చు..
ఎన్పీఎస్లో 18 నుంచి 70 ఏళ్లలోపు వారు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే వారికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. నెల వారీగా లేకుంటే వార్షికంగా ఇందులో పొదుపు చేసుకోవచ్చు.. ఎన్పీఎస్ ఖాతా 60 ఏండ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో మీ భార్య పేరు మీద ఖాతా తెరిచి నెలకు రూ. 5000 పెట్టుబడి పెట్టండి చాలు. రూ. 1.14 కోట్ల ఫండ్ లభిస్తుంది. మీ భార్య వయస్సు ఇప్పుడు 30 ఏళ్లు అనుకుంటే.. ఎన్పీఎస్ ఖాతాలో నెలకు రూ. 5000 పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. 10 శాతం వార్షిక రాబడి మీద 60 ఏళ్ల వయస్సులో ఖాతాలో దాదాపు రూ.1.12 కోట్లు ఉంటాయి. ఈ ఫండ్ నుంచే దంపతులకు నెలకు రూ.45 వేల వరకు పెన్షన్ అందనుంది.
View this post on Instagram