Dussehra holidays : దసరా సెలవులకు ఊరెళ్తున్నారా..? సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

Dussehra holidays

Dussehra holidays

Dussehra holidays : దసరా పండగను తమ స్వగ్రామాల్లో జరుపుకునేందుకు హైదరాబాద్ జనం తరలివెళ్తున్నారు. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. దీంతో దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. ఇంట్లో ఎవరూ లేకుండా వెళ్లిపోతే సొమ్మును జాగ్రత్త చేసుకోవాలని తెలిపారు. సాధారణ రోజుల కంటే ఇలాంటి సందర్భాల్లో అధికంగా దొంగతనాలు జరుగుతాయని హెచ్చరించారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే వెళ్లాలని చెప్పారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు.

1. దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.

2. సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం మరియు మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.

3. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం ఉన్న తాళం అమర్చుకోవడం మంచిది.

4. తాళం వేసు ఊరికి వెళ్లాల్సి వస్తే మీ యొక్క స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి.

5. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100కు ఫోన్ చేయండి.

6. మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి. మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది.

7. నమ్మకమైన వాచ్ మన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి.

8. మీ ఇంట్లో ఉన్న సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.

9. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్స్, పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని కూడా గమనించి దొంగతనాలకు పాల్పడతారన్న విషయాన్ని గమనించండి.

10. మేన్ డోర్ కు తాళం కప్ప వేసినప్పటికీ అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది.

11. బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసి ఉంటే మంచిది.

12. మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండాలని చెప్పండి.

13. మీ ఇంటికి వచ్చే, వెళ్లే దారులు మరియు ఇంటి లోపల సిసి కెమెరాలు అమర్చుకొని డివిఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో ఉంచండి.

14. అల్మరా మరియు కప్ బోర్స్డ్ కు సంబంధించిన తాళాలు మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచడం మంచిది.

15. బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్లకు వెళ్లేటప్పడు తగు జాగ్రత్తలు తీసుకోండి.

16. సోషల్ మీడియాలో మీరు బయటకు వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు.

17. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి.

18. మీకు ఎవరి మీదనైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రా నంబర్ కు గాని, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూం 94906 17100కు లేదా వాట్సాప్ నంబర్ 94906 17444 కు డయల్ చేయండి.

TAGS