JAISW News Telugu

Paratha : పరోటాలు ఎక్కువగా తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

Paratha

Paratha

Paratha : ఆహారం విషయంలో జనాలు అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. తెలిసి చేసినా, తెలియక చేసినా.. ఈ మధ్య చాలా మంది చపాతీలకు బదులు పరోటాలు తింటున్నారు.  వెజ్, నాన్ వెజ్ కాంబినేషన్ లో పరోటాలు తినడానికి ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు. పరోటాలు రుచిగా ఉంటాయి కాబట్టి అందరూ ఇష్టపడతారు. మైదాతో పరోటాలు చేస్తారన్న సంగతి తెలిసిందే. మైదాను అతిగా తీసుకుంటే మధుమేహం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మందికి షుగర్ వ్యాధి రావడానికి కారణం పరోటా అని తాజా అధ్యయనాల్లో తేలింది.

 ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలోని చాలా హోటళ్లలో పరోటా వంటకం తప్పనిసరిగా ఉంటుంది. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనుషుల్లో మధుమేహానికి కావాల్సిన పోషకాల్లో 70 శాతం పరోటాలో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ పెంచి కిడ్నీలు పాడయ్యే పరోటాలను తీసుకోకపోవడమే మంచిదని. దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

మైదా పిండి తయారీలో వాడే బ్రోమైట్ శరీరానికి చాలా హానికరం. గోడలపై పోస్టర్లు అతికించడానికి ఉపయోగించే పిండి ఒక రకమైన స్లో పాయిజన్ అని చెప్పవచ్చు. మైదా తింటే కొన్ని క్రిములు ప్రాణాలు కోల్పోతాయి అంటే మైదా తింటే ఏ స్థాయిలో హాని జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. హల్వా, బొబ్బట్, పరోటా, బ్రెడ్ వంటి వాటికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పరోటా ప్రియులు జర జాగ్రత్త.

Exit mobile version