KCR : పార్టీని కాపాడుకోడానికే బయటకు వస్తున్నావా…కేసీఆర్
KCR : ప్రజలకోసం నేనున్నానంటూ కేసీఆర్ తాజాగా బస్సు యాత్ర చేపట్టిండు. వాస్తవానికి అయన బయలు దేరింది పార్టీ ఉనికిని కాపాడుకోడానికి. వాస్తవం కేసీఆర్ ఎప్పుడు అంగీకరించడు.పార్టీకి అంత సాహసం కూడా లేదు. కరువుతో తల్లడిల్లుతున్న రైతులను ఆదుకునేందుకు నేను బయలు దేరాను అనేది పాచి రాజకీయ అబద్దం.అయన పదేళ్ల పరిపాలనలో రైతులు ఎన్నో ఐబీ ఇబ్బందులు పడ్డారు.ఖమ్మం లో రైతులకు సంకెళ్లు వేసింది రైతులు ఇపుడు కూడా మరచిపోరు..ప్రగతి భవన్ నే సచివాలయం చేసుకొని పరిపాలించిన ముఖ్యమంత్రి దేశంలో బహుశ కేసీఆర్ ఒక్కరే ఉంటారనే అభిప్రాయం కూడా జనం లో ఉంది. ప్రతిపక్షాల్లోకి కూరుకుపోయిన పార్టీకి తిరిగి జీవం పోయాలంటే ఎదో ఒకటి చెబుతూ ప్రజల్లోకి వెళ్లాల్సిందే. అందుకు అయన గడప దాటి వస్తున్నాడు.
నాణానికి కేసీఆర్ బొమ్మ..బొరుసు ..
నాణానికి బొమ్మ,బొరుసు ఉన్నటు కేసీఆర్ కూడా ఉద్యమంలో ఒకతీరు \,ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మరోతీరు ఆయన వ్యవహారశైలి కనబడింది. ఉద్యమ సమయంలో కూడా పార్టీ బలోపేతం అయిన తరువాతనే సభలు,సమావేశాలు అంటూ కాలుకు పనిచెప్పాడు.సీఎం పదవి అయన కోరిక. ఆ కోరిక తీరగానే ప్రజలతో నాకు ఇంకా పని ఏముంది అని చెప్పకనే చెప్పాడు.ఈ నేపథ్యంలో సీఎం దర్శనం తిరుపతి దేవుని దర్శనం కంటే కఠినమైనది.పలు సందర్భాల్లో మంత్రివర్గం,ఎమ్మెల్యేలు,ఎమ్మె
కుడితిలో పడ్డ ఎలుకలా పార్టీ పరిస్థితి..
రాష్ట్రంలో పలు సందర్భాల్లో అతివృష్టి, లేదా అనావృష్టి ఏర్పడిన నేపథ్యంలో తన రక్తసంబంధికులైన కొడుకు,లేదా అల్లుడు పరామర్శ పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి. ఇంటర్ ఫలితాల్లో తేడా ఉందని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క విద్యార్ధి కుటుంబాన్ని కూడా ఓదార్చిన పాపాన పోలేదు కేసీఆర్. అయన మంత్రులు,ఎమ్మెల్యేలు దుఃఖంలో ఉంటె మాత్రం ఓదార్పులు,పరామర్శలు చేసాడు. కానీ పట్టం కట్టిన ప్రజల ఇంటి గుమ్మంకు వెళ్ళకపోవడం శోచనీయం. పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లడంతోనే కేసీఆర్ దుఃఖంలో ఉన్నాడు. అంతే కాదు ఆయనను నేటికీ కూడా నమ్ముకున్నవారు సైతం ప్రభుత్వం రాకపోయేసరికి పుట్టెడు బాధలో ఉన్నారు . ఆయనతో పాటు, ఆయన డప్పు వాయించే వారికోసం మళ్ళీ అడ్డగోలు అబద్దాలతో బయలుదేరాడు కేసీఆర్. ఇప్పుడు పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల పార్టీ పరిస్థితి తయారైనది కాబట్టే కేసీఆర్ ప్రజలు కోసం నేనున్నానంటూ వస్తున్నాడు.