Prabhas : ప్రభాస్ పేరు కాదు.. బ్రాండ్ లా మారింది. ప్రభాస్ కెరీర్ ను డివైడ్ చేస్తే బాహుబలికి ముందు ఆ తర్వాత. బాహుబలిని మలిచిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీతోనే పాన్ వరల్డ్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతోనే ప్రభాస్ కూడా పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఆ సమయంలో ఏ దేశం వెళ్లినా బాహుబలి, కట్టప్ప, శివగామి పేర్లు వినిపించేవి. ఇక ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్. ఇటీవల వచ్చిన సలార్ కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇక ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’తో మరోసారి వరల్డ్ స్థాయిలో వెలుగు వెలుగుతున్నాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కల్కి’లో ప్రభాస్.. భైరవగా నటించాడు. సినిమాలో సినిమాలో ప్రభాస్ యాక్షన్ అదిరిపోయింది. స్పెషల్ షో నుంచే బాక్సాఫీస్ టాక్ సంపాదంచుకుంది. కల్కి రిలీజ్ కు ముందు ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా సంవత్సరాలకు ప్రభాస్ సినిమా ఎలాంటి నెగిటివిటీ లేకుండా హౌజ్ ఫుల్ కలెక్షన్ తో ఆడుతుంది.
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ సాహోతో వచ్చాడు. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా కలెక్షన్లను సాధించలేదు. సాహో ట్రైలర్ లో ఒక్కొక్క షాట్ లో ప్రభాస్ ఒక్కోక్క విధంగా కనిపించాడు. కొన్ని షాట్లలో స్లిమ్ గా, మరికొన్నింటిలో లావుగా కనిపించారు. అప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. ఆ విషయంపై పెద్ద చర్చ జరిగింది.
ఆ తర్వాత ‘రాధే శ్యామ్’లో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య డిఫరెన్సెస్ తో షూటింగ్ సరిగ్గా జరగలేదని రూమర్స్ వచ్చాయి. ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఈ రూమర్లు పెరిగిపోయాయి. మూవీ కూడా అంతలా ఆకట్టుకోలేదు. ఇక ఆది పురుష్ విషయంలో ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు. గ్రాఫిక్స్, మేకప్స్ విషయంలో తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంది.
గతేడాది సలార్ లో ప్రభాస్ కు డైలాగులు తక్కువ ఉన్నాయని అభిమానులు పెదవి విరిచారు. ఇక ఇప్పుడు ‘కల్కి’ విషయంలో మాత్రం ఎక్కడా నెగిటివ్ టాక్ లేదు. మేకర్స్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడంతో మూవీపై అన్ని వర్గాల్లో పాజిటివ్ బజ్ క్రియేటైంది. చాలా ఏళ్లకు ఎలాంటి నెగిటివిటీ లేకుండా వస్తున్న ‘కల్కి’ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు.