Prashanth Neel : తలైవితో రెండు ప్రాజెక్టులు నిజమేనా..? నీల్ మామ వెనుక అసలేం జరుగుతోంది?
Prashanth Neel : కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తను చేసిన కేజీఎఫ్ తో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారాడు. ఇటీవల ప్రభాస్ తో సలార్ చేయగా.. సీక్వెల్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. హఠాత్తుగా ఈ రోజు (జూలై 24) ఉదయం నుంచి తమిళ స్టార్ హీరో అజిత్ తో ప్రశాంత్ నీల్ ఏకంగా రెండు సినిమాలు చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చెన్నై వర్గాల నుంచి వచ్చిన న్యూసేనని, ఇందులో ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదని తెలుస్తోంది. తలైవికి రెండు కథలు చెప్పారని అందులో ఒకటి సినిమాటిక్ యునివర్స్ తో ముడిపడేలా ఉందని, ఇండివిడ్యూవల్ సబ్జెక్టుతో మరొకటి ఉందని ఈ రెండు చేసేందుకు తలైవి అంగీకారించాడని గాసిప్ ల సారాంశం. నిర్మాణ సంస్థ ఏంటి? ఇదంతా ఎప్పుడు జరిగింది? లాంటి వివరాలు లేవు కానీ అజిత్ అభిమానులు మాత్రం ఈ వార్తను వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ప్రాక్టికల్ గా చూస్తే ప్రశాంత్ చేతిలో చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. ‘సలార్ 2’, ‘శౌర్యంగపర్వం’ దీనికి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయ్యిందట. ప్రభాస్ డేట్లు కొంచెం పెండింగ్ లో పడ్డాయని చూస్తున్నాడు లేదంటే కనీసం అనౌన్స్ చేసేవాడని తెలుస్తోంది. దీనితో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో నీల్ ప్లాన్ చేసుకున్న ‘డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)’ పనులు కూడా తెరవెనుక జరిగుతున్నాయి. మైండ్ బ్లోయింగ్ బడ్జెట్ ను ‘మైత్రి మూవీ మేకర్స్’ ఇప్పటికే సెట్ చేసి పెట్టారు. భవిష్యత్తులో ‘కేజీఎఫ్ 3’ వస్తుందని యష్ తో పాటు నిర్మాత విజయ్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. అంటే దీని వర్క్ కూడా బ్యాక్ డ్రాప్ లో జరుగుతూనే ఉండాలి.
ఇవి కాకుండా రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ కు డీల్ కుదిరే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ అనుకుంటుంది. ఇంత టైట్ షెడ్యూల్ పెట్టుకున్న నీల్ మామ అజిత్ తో రెండు సినిమాలు ఎలా చేస్తాడన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న. ఇది కేవలం గాసిప్పా లేదంటే నిజంగానే చర్చలు జరిగాయా? అనేది త్వరలో తెలుస్తుంది. నేరుగా ప్రశ్నిద్దామంటే నీల్ బయట కనిపించడు. ఈవెంట్లకు సైతం హాజరవడం లేదు. తారక్, ప్రభాస్ చెరీ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ప్రశాంత్ నీల్ టెంపరరీగా వేరే ఆప్షన్లు చూస్తున్నారా లేక తెరవెనుక మతలబు ఏమైనా ఉందా? అనేది వేచి చూడాలి.