BCCI : టీమిండియా నుంచి ఆ ఐదుగురిని తప్పిస్తున్నారా? బీసీసీఐ సంచలన నిర్ణయం..

BCCI

BCCI

BCCI : T20 వరల్డ్ కప్ సొంతం చేసుకున్న భారత్. అదే ఊపుతో జింబాబ్వే పర్యటనకు వెళ్లబోతోంది. జులై 6వ నుంచి జింబాబ్వే‌తో భారత్ ఐదు T20 సిరీస్ ఆడనుంది. అయితే భవిష్యత్ స్టార్లను సిద్ధం చేసేందుకు ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. పొట్టి కప్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ T20లకు గుడ్ బై చెప్పారు.

వీరి స్థానాలను భర్తీ చేసేందుకు యంగ్ ప్లేయర్స్ ను టీమ్ లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు సెలక్టర్స్. ఈ యంగ్ టీమ్‌కు శుభ్‌మన్ గిల్ సారథ్యం (కెప్టెన్) వహించబోతున్నాడు. హరరే వేదికగా జింబాబ్వేతో శనివారం తొలి మ్యాచ్ జరనుంది. ఆదివారం సెకండ్, 10, 13, 14వ తేదీల్లో మూడు మ్యాచ్ లు జరుగుతాయి.

జింబాబ్వే పర్యటన నుంచి యశస్వీ జైస్వాల్‌, శివమ్ దూబె, సంజు శాంసన్‌, ఖలీల్‌ అహ్మద్‌, రింకూ సింగ్ ను తప్పించే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ ఐదుగురు ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్నారు. దూబె, సంజు శాంసన్, జైస్వాల్ వలర్డ్ కప్ గెలిచిన భారత జట్టుతో ఉండగా, రింకూ, ఖలీల్ రిజర్వ్ ప్లేయర్లుగా టీమ్ తోనే ఉన్నారు.  

T20 విజయం తర్వాత టీమిండియా జట్టు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. బార్బడోస్ తో పాటు  సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్ దీవులపై హరికేన్ ప్రతాపం చూపుతుండడంతో విమాన రాకపోకలను నిషేధించారు. దీంతో బింబాబ్వే పర్యటనకు వెళ్లే ఐదుగురు ఆటగాళ్లు రావడం ఆలస్యమయ్యేలా ఉంది. దీనికి తోడు వరుస ప్రయాణాలతో ఆటగాళ్లు అలిసిపోతారని బీసీసీఐ భావిస్తోంది. దీంతో జైస్వాల్‌, దూబె, శాంసన్‌, ఖలీల్‌, రింకూలను జింబాబ్వే టూర్ నుంచి తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటోంది.

జింబాబ్వే టూర్ కు వెళ్లే భారత జట్టు..
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.

TAGS