AP Employees : ఈనెల 23 నుంచి ఆ ఉద్యోగులు కూడా సమ్మెలోకేనా?
AP Employees : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సమ్మెల కాలం నడుస్తోంది. ఉద్యోగులు, కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనడంతో పనులు కుంటుపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమ్మెలతో సర్కారు సతమతమవుతోంది. అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రోడ్లపైకి వస్తుండటంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి.
వీరితో పాటు 104, 108 ఉద్యోగులు సైతం సమ్మె చేసేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 23 నుంచి వారు సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చారు. ఆ లోపు సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేయడం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో సర్కారు నోట్లో పచ్చి వెలక్కాయ పడనట్లు అయింది. ఈనెల 22లోగా డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె తప్పదని అల్టిమేటం జారీ చేశారు.
ఈ క్రమంలో ఏపీలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది పరిస్థితి. అటు ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చలేక ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం సతమతమవుతోంది. ఉద్యోగుల తీరుతో ప్రభుత్వం నెత్తిన పచ్చివెలక్కాయ పడినట్లు అవుతోంది. ఉద్యోగుల ఆందోళనతో పనులు అటకెక్కడం గమనార్హం.
ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోవడంతో సమ్మె ఇంకా పొడిగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సర్కారు నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏం చేయాలనే ఆలోచనలో ఉద్యోగులు పడిపోతున్నారు. ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సర్కారు తీరుతో అన్ని వర్గాలు సతమతమవుతున్నాయి. ఇక ఏ నిర్ణయం తీసుకుంటుందోననే బెంగ అందరిలో పట్టుకుంది.