Ayodhya : అయోధ్యలో వారికి అంత గౌరవం ఇస్తున్నారా?
Ayodhya : మన దేశంలో సీరియళ్లకు భలే డిమాండ్ ఉంటుంది. ధారావాహిక కార్యక్రమాలంటే అందరికి ఎంతో ఇష్టం. అందుకే సీరియళ్లకు ఆకర్షితులవుతుంటారు. ఇప్పుడు పలు చానళ్లలో సీరియళ్ల భాగమే ఎక్కువ. ఈ నేపథ్యంలో 1957-58 సంవత్సరంలో హిందీ వెర్షన్ లో వచ్చినా రామాయణం సీరియల్ అదరగొట్టింది. ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన సీరియల్ గా గుర్తింపు పొందింది.
ఐదు ఖండాల్లో 17 దేశాల్లో 20 వేరు వేరు చానళ్లలో వేరు వేరు సమయాల్లో ప్రసారం చేశారు. బీబీసీ ప్రకారం ఈ సీరియల్ 650 మిలియన్ల మంది వీక్షితులుగా మారారు. ప్రతి ఎపిసోడ్ కు డీడీ రూ.40 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ ధారావాహికను సాగర్ ఆర్ట్స్ నిర్మించింది. విష్ణువు అవతారాల్లో ఏడోది రామావతారం. రావణుడి చెర నుంచి సీతను రక్షించడానికి చేసే ప్రయాణమే రామాయణం.
రామాయణం రచించిన వాల్మీకి కథ ఆధారంగా తెరకెక్కింది. రాముడి సోదరుడు లక్ష్మణుడు అంకిత భావంతో వానర వీరుడు హనుమంతుడు ఎదుర్కొన్న కష్టాలను తెలియజేస్తుంది. ఇందులో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా నటించారు. సునీల్ లహరి, అరవింద్ త్రివేదీ, ధారా సింగ్ వారి వారి పాత్రల్లో జీవించారు. దీంతో సీరియల్ చాలా రోజులు ఓ రేంజ్ లో వెళ్లింది.
సీరియల్ కు దర్శకుడు రామానంద సాగర్. నిర్మాతలుగా దయానంద సాగర్, రామానంద సాగర్, మోతీ సాగర్ వ్యవహరించారు. రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ను సాక్షాత్తు రాముడిగానే కొలిచేవారు. ప్రస్తుతం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వారికి లభిస్తున్న ఆదరణ మామూలుగా లేదు. ఇన్ని రోజులైనా వారి మీద ఇంత గౌరవం చూపిస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.