Zodiac Signs Trouble : మరో నెల రోజుల పాటు ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవా?

Zodiac Signs Trouble

Zodiac Signs Trouble

Zodiac Signs Trouble : మన జాతక రీత్యా ద్వాదశ రాశులుంటాయి. ఈ రాశుల సంచారంతో కొన్ని రాశులకు ప్రతికూల ప్రభావాలేర్పడతాయి. దీని ప్రభావంతో నవంబర్ 17 నుంచి నెల రోజులపాటు సూర్యుని సంచారం వల్ల మూడు రాశులకు ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల పాటు వీరికి యోగం బాగా లేదు. అందుకే వీరు చేసే పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే కష్టాలే వస్తాయి.

మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే సూచనలున్నాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేతిలో డబ్బులు నిలవవు. ఆర్థిక లాభాలు కలిగే దారులు కూడా మూసుకుపోతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి ఆందోళనకు గురి చేస్తుంది. నెల రోజుల పాటు వివాదాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

కుంభ రాశి వారికి జీవిత భాగస్వామితో గొడవలు తలెత్తే అవకాశం ఉంది. సహనంతో ఉండాలి. జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త పని ప్రారంభించాలంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. ఈ రాశి వారు ఎంత అణకువగా ఉంటే అంత సురక్షితం. ఆలోచనలు అదుపులో ఉండాలి. పనులు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

కన్య రాశి వారికి వైవాహికంగా ఇబ్బందులు పడతారు. మానసిక రుగ్మతలు రావచ్చు. గొడవలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. ఈ రాశి వారికి దారిద్ర్యమే వెన్నంటి ఉంటుంది. ఏ పనిచేసినా ముందుకు వెళ్లదు. అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. సంయమనంతో వ్యవహరించాలి. జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి.

TAGS