CM Jagan : జగన్ అపజయానికి కారణాలు ఇవేనా ???

YS Jagan

CM Jagan

CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  రెండోసారి అధికారంలోకి వస్తాను అని కళలు కంటున్నారు. ఆ కళలను నిజం చేసుకోడానికి ప్రతిపక్షాలను తనదయిన శైలిలో డీ కొంటున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిగా ఏర్పడ్డాయి. అన్న జగన్ పై ఎందుకు కోపం వచ్చిందో చెల్లె షర్మిల కూడా కాంగ్రెస్ జెండా తో పోరాటం చేస్తోంది. ఈ రెండు వర్గాలను ఎదుర్కొని అధికారం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం జగన్. కానీ జగన్ ఐదేళ్ల  పరిపాలననే అపజయానికి కారణం అవుతున్నదనే అభిప్రాయంలో ఏపీ లో వ్యక్తం కావడం విశేషం.

2019 ఎన్నికల్లో అన్న గెలుపు కోసం చెల్లెలు షర్మిల పాదయాత్ర చేసింది. ఇప్పుడు అన్న, చెల్లెలు మధ్య బంధం చెడిపోవడంతో ఆమె కూడా కాంగ్రెస్ లో చేరి అన్న ఓటమికి కంకణం కట్టుకొంది. 2019 ఎన్నికల సమయంలో తెలుగు దేశం, జనసేన వీడి వైసిపి కండువా కప్పుకున్న నాయకులను నిర్లక్ష్యం జరిగింది జగన్ కూటమిలో.  నిర్లక్ష్యానికి గురైన నాయకులందరూ నేడు సొంత గూటికి వెళ్లి జగన్ ఓటమి కోసం పావులు కదుపుతున్నారు.

చిత్ర పరిశ్రమకు జగన్ పరిపాలన చుక్కులు చూపించింది. సినీ నటులు, సాంకేతిక వర్గం, సినీ పెట్టుబడిదారులు అనేక ఇబ్బందులకు గురైనారు. నటుల స్థిరాస్తులను కబ్జా చేసి తమ పరిపాలన అంటే ఏమిటో రుచి చూపించారు. పదిమందిలో దర్శకులను అవమానించడం, సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించి, నిర్మాతలను ఆర్థికంగా దెబ్బదీసి జగన్ పరిపాలన కోలుకోకుండా చేసింది.

సినీ పరిశ్రమకు చెందిన సంస్థలు ఉంటె సంస్థలను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు పార్టీకి చెందిన పలువురు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సినీపరిశ్రమ వ్యక్తి అయినప్పటికీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా ఏకమై జగన్ కు వ్యతిరేకంగా  
పనిచేస్తున్నాయి.  

గడిచిన ఐదేళ్ల పాటు కేంద్రం ఆశీస్సులు పుష్కలంగా జగన్ కు అందాయి. ఇప్పడు సాక్షాత్తు జగన్ ఓడించడానికి ప్రధాన మంత్రి రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులతోపాటు జగన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైనది.  ఢిల్లీ నుంచి గల్లీ దాక వ్యతిరేకత రావడంతో జగన్ ఓటమి తప్పదా అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

TAGS