JAISW News Telugu

TDP – JDU : టీడీపీ, జేడీయూ కోరుతున్న కేబినేట్ శాఖలు ఇవే?

TDP - JDU

TDP – JDU

TDP – JDU : మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్ల దూరంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటులో మిత్ర పక్షాల అవసరం తప్పనిసరైంది. ‘ఆప్ కీ బార్ 400 పార్’ నినాదంలో ఎన్నికల్లోకి వెళ్లిన ఎన్డీయే ప్రభుత్వం 292తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందులో బీజేపీ సొంతంగా 240 సీట్లు తెచ్చుకోగా.. ఎన్డీయే మిత్ర పక్షాల సీట్లు 52తో కలుపుకొని 292 చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేసేందుకు బీజేపీకి 32 సీట్లు అవసరం. కానీ తెచ్చుకోవడంలో విఫలమైంది.

ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో మిత్ర పక్షాల పాత్ర విడదీయలేనిది. గతంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సారి మాత్రం మిత్రులపై ఆధారపడాల్సి వస్తుంది. అందులో ముఖ్యమైన మిత్రులుగా జేడీయూ, టీడీపీ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి 28 సీట్లు ఉన్నాయి. అంటే విడి విడిగా చూస్తే టీడీపీకి 16, జేడీయూకు 12 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తున్నాయి.

అయితే, మద్దతిస్తున్న పార్టీల కేబినెట్ హోదా కోరుకోవడం సబబే కదా.. రెండు పార్టీలు తమ రాష్ట్రానికి ఏం కావాలని అడుగుతున్నాయన్న దానిపై సర్వత్ర చర్చ నడుస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. టీడీపీ ప్రత్యేక హోదాతో పాటు స్పీకర్ పదవి, రెండు కేబినెట్ బెర్తులు కోరుతుందని, మరో పార్టీ జేడీయూ రైల్వేతో పాటు వ్యవసాయ శాఖను కోరుతుందట. ఇక హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ లాంటి కీలకమైన శాఖలను బీజేపీ తన వద్దే పెట్టుకుంటుంది.

ఈ రెండు పార్టీల కోరికలను నరేంద్ర మోడీ అంగీకరిస్తారా? అనేది మరో రెండు, మూడు రోజులు ఆగితే తెలుస్తుంది. 

Exit mobile version