2024 Budget : ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం మామూలే. కానీ ఈ సారి ఎన్నికలు ఉండటంతో బడ్జెట్ ఆకర్షణీయంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఏరంగాలకు ప్రాధాన్యం ఇస్తారు? వేటి మీద పన్ను తగ్గిస్తారు? మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారనే విషయాల మీద చర్చ సాగుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేజిక్ లు చేస్తారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
2024-25 బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో తాయిలాలుంటాయని భావిస్తున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ గా చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పన చేస్తారట. దీంతో ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండవని తెలుస్తోంది. మామూలుగానే బడ్జెట్ తయారు చేస్తారని అంటున్నారు.
గతంలో బడ్జెట్ ను ఫిబ్రవరి చివరలో ప్రవేశపెట్టేవారు. మోదీ ప్రధాని అయిన నాటి నుంచి బడ్జెట్ ఫిబ్రవరి 1నే ప్రవేశపెడుతున్నారు. 2017లో నాటి కేంద్ర ఆర్థిక మత్రి అరుణ్ జైట్లీ వలస రాజ్యాల మాదిరిగా ఫిబ్రవరి చివరి రోజునే కేంద్ర బడ్జెట్ ను సమర్పించమని చెప్పారు. అప్పటి నుంచి బడ్జెట్ ఫిబ్రవరి 1నే ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 1ని బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరైన సమయంగా భావిస్తున్నారు.
బడ్జెట్ గురించి ప్రజలకు ఆసక్తి ఉంటుంది. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం తనకు ఉపయోగపడే వాటికే ప్రాధాన్యం ఇస్తుంటుంది. ప్రజల బాగోగులు పట్టించుకునే ప్రభుత్వం ఉండదనే విషయం చాలా మందికి తెలియదు. కానీ వారి ఆశలు మాత్రం అలాగే ఉంటాయి.