Congress : కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఓ లెక్క.. లేకుంటే మరో లెక్క. దేశ సర్వ అవస్థలకు కాంగ్రెస్ పార్టే కారణమని బీజేపీ వాళ్లు విమర్శిస్తుంటారు కూడా. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని జబ్బలు చరుచుకునే నేతలు అవినీతి, కుంభకోణాలు చేయడంలోనూ కాంగ్రెస్ వాళ్లను మించినోళ్లు లేరని వారే నిరూపిస్తుంటారు.
‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్..’’ అని మాజీ ప్రధాని వాజ్ పేయి చెబుతుండేవారు. ఇప్పటి కాంగ్రెస్ పరిస్థితి చూస్తే వాజ్ పేయి మాటలు వంద శాతం నిజమే అనిపిస్తుంది. అధికారంలోకి రావడానికి దేశ హితాన్ని సైతం పట్టించుకోదు. ఎవరితోనైనా చేతులు కలుపుతుంది. ఎన్నో కుట్రలకు తెరతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అమలు సాధ్యం కాని ఉచిత హామీలను ఇస్తూ వెళ్తోంది. తద్వారా రాష్ట్రాలు అప్పుల కుప్ప కావడం ఖాయంగా కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే చాలు రాష్ట్రాలు, దేశం ఏమైపోతే తమకేంటి అనుకుంటోంది.
ఇక తాజాగా మద్దతు ధరలు, రైతు సమస్యలపై పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. మద్దతు వరకు బాగానే ఉన్నా స్వామినాథన్ కమిషన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నన్ని రోజులు అమలు చేయకుండా.. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండగా స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని కోరడం రాజకీయ అవకాశవాదమే. ఈవిషయంలోనే కాదు కాంగ్రెస్ చేసే ప్రతీ పని అధికారం కోసమే. అధికార యావ తప్ప దేశ శ్రేయస్సు ఆ పార్టీకి ఎన్నడూ పట్టదని పలువురు అభిప్రాయపడుతుంటారు.