Senior cricketer : టీమిండియా సీనియర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడకుల మధ్య సాగుతున్నది.ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా పరాజయం కావడంతో జట్టుు నుంచి తప్పుకున్నాడు. దీని తర్వాత, బీసీసీఐ ఈసారి అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కూడా చోటు ఇవ్వలేదు. దులీప్ ట్రోఫీలో తనను తాను నిరూపించుకోవడానికి అయ్యర్‌కు మంచి అవకాశం లభించింది. కానీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో రాణించలేకపోయాడు. శ్రేయాస్ 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 104 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రస్తుతం టెస్టు జట్టులో అయ్యర్‌కు చోటు లేదనే బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
టెస్ట్ జట్టు తలుపులు మూసుకుపోయాయా?
ప్రస్తుతం శ్రేయాస్‌కు టెస్టు జట్టులో స్థానం లేదని బీసీసీ అధికారి ఒకరు పేర్కొన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దులీప్ ట్రోఫీలో విఫలమడంతో అతని ఎంపికపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్టోబర్ ఒకటి నుంచి లక్నోలో ప్రారంభం కానున్న ఇరానీ కప్‌లో ముంబై జట్టులో శ్రేయస్ చేరే అవకాశాలు ఉన్నాయని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. మరో వైపు బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అక్టోబర్ 6 న ప్రారంభం కానుంది. ఇరానీ కప్ లో రాణిస్తే రెండో T20కి అందుబాటులో ఎంపిక చేసే అవకాశాలను టీమ్ మేనేజ్ మెంట్ పరిశీలించనున్నది.
శ్రేయాస్ ఇరానీ కప్‌లో ఆడకపోయినా రంజీ ట్రోఫీలో పరుగులు చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో శ్రేయాస్ బ్యాటింగ్ రాణించాడు. కానీ గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లు ఆడలేపోయాడు. ఇక దులీప్ ట్రోఫీలో మరో రౌండ్ మిగిలి ఉంది. ఇందులో సెంచరీ కొడితే ఆశలు సజీవంగా ఉంటాయి. మరో వైఫు షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడంలో అయ్యార్ విఫలమవుతున్నాడు. దీంతో అతడిని ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయకపోవచ్చు.