India VS Pakistan : చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. 2025 మార్చి ఒకటో తేదీన తలపడడానిని సిద్ధం కాబోతున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ కి అందజేసింది. ఈ టోర్నీకి సంబంధించి బీసీసీఐ (భారత క్రికెట్ బోర్డు) ఇంకా అంగీకారం తెలుపలేదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సీనియర్ సభ్యుడొకరు బుధవారం ఈ విషయం వెల్లడించారు. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది, మార్చి 10ని ‘రిజర్వ్ డే’గా ప్రకటించారు. మొత్తం 15 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సమర్పించినట్లు తెలిసింది.
లాహోర్, కరాచీ రావల్పిండిలో మ్యాచ్‌లు
‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మ్యాచ్‌ల డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను పీసీబీ సమర్పించింది. ఇందులో లాహోర్‌లో ఏడు మ్యాచ్‌లు, కరాచీలో మూడు మ్యాచ్‌లు, అలాగే రావల్పిండిలో ఐదు మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.
గ్రూప్ ఏలో భారత్-పాకిస్థాన్
గ్రూప్ ఏలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కలిసి భారత్‌కు చోటు దక్కింది. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఇటీవల, ఐసీసీ టోర్నమెంట్స్ చీఫ్ క్రిస్ టెట్లీ ఇస్లామాబాద్‌లో పీసీబీ ఛైర్మన్ నఖ్వీని కలిశారు. అంతకుముందు, ప్రపంచ సంస్థ సెక్యూరిటీ టీమ్ మ్యాచ్ వేదికలతో పాటు ఇతర ఏర్పాట్లను పరిశీలించింది.
పాకిస్థాన్ లో ఇండియా పర్యటిస్తుందా?
చివరిసారిగా పాకిస్తాన్ 2023లో ‘హైబ్రిడ్ మోడల్’లో ఆసియా కప్‌ను నిర్వహించింది. భారత్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాల బోర్డు హెడ్‌లందరూ (బీసీసీఐ కాకుండా) అంగీకరించారు. అయితే బీసీసీఐ ప్రభుత్వంతో సంప్రదించి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నది. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వెళ్లమని ఏ బోర్డును ఐసీసీ బలవంతం చేయదు. ప్రస్తుతం బీసీసీఐ నిర్ణయం ఆసక్తిక నెలకొంది.