Chiranjeevi-Rajinikanth : సూపర్ స్టార్స్ వారసులు తమ తల్లితండ్రులను వేరే లెవెల్ కి తీసుకెళ్ళాలి అనే తపనతో ఉంటారు , అదే విధమైన ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ విషయం లో చాలా అదృష్టవంతుడు అనే చెప్పాలి. తాను నాలుగు దశాబ్దాలుగా చూడని పాన్ వరల్డ్ స్టార్ స్టేటస్ ని రామ్ చరణ్ నేడు ఎంజాయ్ చేస్తున్నాడు. చిరంజీవి కీర్తి ప్రతిష్టలను, ఆయన లేజసి ని ప్రపంచ నలుమూలల విస్తరింప చేసాడు.
అయితే ఆయన కూతుర్లు మాత్రం చిరంజీవి ఇమేజి ని తగ్గించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని అభిమానులు ఎప్పటి నుండో సోషల్ మీడియా లో వాపోతున్నారు. చిన్న కూతురు శ్రీజా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె వైవాహిక జీవితం చిరంజీవి ప్రతిష్టకి పెద్ద తలపోటు. కానీ పెద్ద కూతురు నుండి అలాంటి తలపోట్లు ఏమి లేకపోయినా చిరంజీవి కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేస్తూ ఆయనకీ జాతర బుడబుక్కలోడి వేషం వేస్తుందని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుండో సుస్మిత ని సోషల్ మీడియా లో తిడుతూనే ఉన్నారు.
అంతే కాకుండా పనికిమాలిన రీమేక్ సినిమాలు చెయ్యమని సలహాలు ఇచ్చేది కూడా ఆమెనే అట. దాని వల్ల చిరంజీవి కి ఇటీవల కాలం లో రెండు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. అభిమానులు ఈ సినిమాల ఫలితాల పై చాలా బాధపడ్డారు. చిరంజీవి కూతురు అయినా కనీసం కాస్ట్యూమ్ డిజైనింగ్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వరకే ఆగింది, కానీ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య అయితే ఏకంగా దర్శకత్వం కూడా వచించే సాహసం చేసింది. రీసెంట్ గానే ఆమె దర్శకత్వం లో తెరకెక్కిన ‘లాల్ సలాం’ చిత్రం విడుదలైంది.
రజినికాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి ఘోరమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదంటే ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచు. ‘జైలర్’ చిత్రం సూపర్ స్టార్ మళ్ళీ ఫామ్ లోకి అవచేసాడు అని అభిమానులు సంతోషిస్తున్న ఈ సమయం లో వాళ్లపై ‘లాల్ సలాం’ చిత్రం నీళ్లు చల్లింది. విచిత్రం ఏమిటంటే చాలా మందికి ఈ సినిమా విడుదలైన విషయం కూడా తెలియదట.