CM Jagan : ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మార్పులు చేసుకుంటున్నారు. ఇదివరకు ఇన్ చార్జీలను మార్చిన వెంటనే తలెత్తిన పరిణామాల నేపథ్యంలో తన నిర్ణయాలను పరిశీలించుకుంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసంమార్పులు చేస్తామని చెబుతున్నా ఆ దిశగా వ్యతిరేక పవనాలు వీయడంతో మనసు మార్చుకుంటున్నారు. పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత మామూలుగా లేదు. ఎవరిని కదిలించినా జగన్ గెలవడం కష్టమే అంటున్నారు. ఇన్ చార్జీల మార్పుతో వచ్చిన వ్యతిరేకతతో జగన్ లో మార్పు వచ్చింది. ఇక మీదట ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మూకుమ్మడిగా కలిసి నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ చార్జీల మార్పుతో మొదలైన ఆందోళన తారాస్థాయికి చేరింది.
ఈనేపథ్యంలో ఆదిమూలపు సురేష్ లోకేష్ ను కలవడంతో జగన్ లో వణుకు పుట్టింది. నేతలందరు వెళ్లిపోతే నష్టం తీవ్రంగా ఉంటుందని భావించారు. అందుకే ఇక మీదట స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవద్దని అనుకుంటున్నారు. నేతలను సరైన దారిలో నడిపించేందుకు అందరితో మమేకం కానున్నారని తెలుస్తోంది. అందరి సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు.
ఈమేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను నియమిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినందున నేతలను సరైన దారిలో పెట్టడం కత్తి మీద సాముగానే మారింది. ఈ క్రమంలో జగన్ తీసుకునే నిర్ణయాల మీదే రాజకీయ భవితవ్యం నిలిచి ఉంటుందని భావిస్తున్నారు. జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.