Hero records : ఆ స్టార్ హీరో రికార్డులన్నీ డమ్మీయేనా? సక్సెస్ అయినా లాభం లేదా !

hero records Dummy : టాలీవుడ్  ప్రేక్షకులకు  హీరోలు ఆరాధ్య దైవాలు. తమిళం, తెలుగులోనే ఈ తరహ ఫ్యాన్ బేస్ కనిపిస్తుంది.  మిగతా ప్రాంతీయ భాషలతో పాటు బాలీవుడ్  లోనూ స్టార్ హీరోలకు ఫ్యాన్ బేస్ ఉన్నా ఈ రెండు భాషలతో సరితూగవు. ఇక టాలీవుడ్ లో ఫ్యాన్ వార్ కూడా ఎక్కువే. మా హీరో గొప్ప అంటే.. మా హీరోనే గొప్ప అనే భేషజాలు కూడా ఎక్కువే. ఇందులో హీరోలు కూడా తక్కువేం కాదు. అత్యధిక సెంటర్లనీ, అత్యధిక కలెక్షన్లనీ, ఎక్కువ సెంటర్లలో వంద రోజులు ఆడిందని గతంలో బాగా ప్రచారం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడది తగ్గిపోయింది. ప్రస్తుతం ఓపెనింగ్స్, లాంగ్ రన్ లో సినిమా ఎంత వసూలు చేసింది… గ్రాస్ ఎంత.. షేర్ ఎంత లెక్కలు నడుస్తున్నాయి. ఇప్పడు అలాంటి ఓ హీరో గురించి టాలీవుడ్ లో చర్చ సాగుతున్నది.
టాలీవుడ్ లో యంగ్ టైగర్ పేరు తెచ్చుకన్నాడు జూనియర్ ఎన్టీఆర్. బలమైన ఫిలిం బ్యాక్ గ్రౌండ్  ఉన్నా తన సొంతంగానే హీరోగా నిలబడ్డాడు. ఇక  నటన, డ్యాన్సులు,ఫైట్లలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నది.  ఇక డైలాగ్ డెలివరీలో ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ను మించిన వారు మరొకరు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తొలి చిత్రం నిన్ను చూశాక చిత్రంలో అచ్చు పెద్ద ఎన్టీఆర్ గెటప్ లో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీ పరంగా నందమూరి కుటుంబంలో తన  తాత, బాబాయ్ తర్వాత తానే  సరైన వారసుడినని నిరూపించుకున్నాడు. నందమూరి కుటంబంలో మరో హీరో ఎస్టాబ్లిష్ కాలేదు.
ఇక ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్లతో టాప్ హీరోగా ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లలోనే సెంటర్లు, వంద రోజులు, రికార్డులనే చట్రంలో ఇరుక్కుపోవడంతో నిర్మాతలకు గిట్టుబాటు కావడం లేదనే టాక్ ఉంది.  గతంలో రాజమౌళి ఎన్టీఆర్ తో చేసిన స్టూడెంట్ నంబర్ 1 మినహా మిగతా ఏ సినిమా కూడా నిర్మాతకు పెద్దగా లాభం చేకూరిందేమీ లేదని ఇన్ సైడ్ టాక్. ఆది సినిమా సూపర్ హిట్టయినా అత్యధిక సెంటర్లలో వంద రోజులు కేవలం ఫ్యాన్ బేస్ కోసం ఆడించాల్సి వచ్చిందనే టాక్ ఉంది. సింహాద్రి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టయినా వంద రోజులు ఎక్కువ సెంటర్లలో ఆడించాలనే ఉద్దేశంతో నిర్మాతకు చేతి చమురు వదిలిందనే రూరమ్ క్రియేట్ అయ్యింది.  ఇక రాజమౌళి యమదొంగ సినిమా చేసినా తొలి రెండు చిత్రాల స్థాయిలో మాత్రం హిట్ కాలేదు. ఎన్టీఆర్ పై భారీ బడ్జెట్ పెట్టి సినిమా చేసినా ఈ రికార్డుల గోలతో నిర్మాతకు మిగిలేదని ఏమీ ఉండదని  రాజమౌళి భావన అని టాక్. దీంతో ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ను ఎక్కువగా ఎక్స్ పోజ్ చేశాడే తప్ప ఎన్టీఆర్ ను ముందు పెట్టలేదు. ఇక ఎన్టీఆర్ తోనే రామ్ చరణ్ కు ఎలివేషన్ ఇప్పించాడు. ఇటీవల వచ్చిన దేవర సూపర్ హిట్ టాక్ వచ్చినా మొత్తంగా మూడు వందల కోట్ల రెవెన్యూ దాటలేదు. కాగా ఈ సినిమా ఖర్చు దాదాపు రూ. 250 కోట్లు. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమా నిర్మాణం సాగితే  నిర్మాతకు రూ.50 కోట్లు. వడ్డీలన్నీ కలిపితే ఈ లాభం ఎందుకు కొరగావడం లేదని టాక్.
TAGS