JAISW News Telugu

Arbaz khan:మేక‌ప్ ఉమెన్‌తో నిర్మాత కం న‌టుడి రెండో పెళ్లి..ఆమె ఎవ‌రంటే?

Arbaz khan:స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ఇంతకుముందు మలైకా అరోరాను వివాహం చేసుకున్నారు. వారు 2016లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత క‌థంతా తెలిసిందే. ఆర్భాజ్ జార్జియా ఆండ్రియానీతో డేటింగ్ చేసాడు. చాలా కాలం ఈ జంట స‌హ‌జీవ‌నం సాగించి, ఇటీవ‌లే బ్రేక‌ప్ అయ్యారు. అయితే మ‌లైకా అరోరా ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్ తో డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇదంతా ఇలా ఉండ‌గానే, విదేశీ భామ జార్జియాతో బ్రేక‌ప్ అయ్యాక ఆర్భాజ్ షురా ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడని క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు అని కూడా ప్ర‌ముఖ హిందీ మీడియా క‌థ‌నం వెలువ‌రించింది. అర్బాజ్ – షురా వారి సంబంధం గురించి చాలా సీరియస్‌గా ఉన్నారు. అతి త్వరలో ఒక‌ట‌వుతారు. ఈ పెళ్లి కుటుంబీకులు స‌హా కొంద‌రు సన్నిహితులతో సన్నిహిత ప్ర‌యివేట్ వ్యవహారంగా ఉంటుంద‌ని తెలిసింది.

ఇండియా టుడే క‌థ‌నం ప్రకారం.. అర్బాజ్ ఖాన్ .. మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ డిసెంబర్ 24న ముంబైలో వివాహం చేసుకోవడానికి సిద్ధమ‌వుతున్నార‌ని సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు పెళ్లికి హాజ‌ర‌వుతార‌ని పేర్కొంది. వారి పెళ్లికి ముందు షురా ఖాన్ ఎవరో తెలుసుకోవాల‌నే కుతూహాలం నెటిజ‌నుల్లో మొద‌లైంది. ఆమె మేకప్ ఆర్టిస్ట్ .. రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని సహా బాలీవుడ్ ప్రముఖులతో కలిసి పనిచేసింది. షూరా ఖాన్ – అర్బాజ్ ఖాన్ తన కొత్త చిత్రం పట్నా శుక్లా సెట్స్‌లో కలుసుకున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రంలో రవీనా టాండన్, చందన్ రాయ్ సన్యాల్, సతీష్ కౌశిక్, మానవ్ విజ్, జతిన్ గోస్వామి, అనుష్క కౌశిక్ నటించారు.

ఇంతకుముందు అర్బాజ్ విదేశీ గాళ్ జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేసాడు. 2019లో ఆమెతో తన సంబంధాన్ని ఆర్భాజ్ ధృవీకరించాడు. ఈ జంట గత సంవత్సరం విడిపోయినట్లు ఇటీవ‌ల‌ పుకార్లు వచ్చాయి. కొంత గ్యాప్ తర్వాత ఏప్రిల్ 2023లో మొహాలీలో ప్రీతి జింటాతో కలిసి కింగ్స్ XI పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన IPL మ్యాచ్‌లో అర్బాజ్ -జార్జియా ఒకరి కంపెనీలో మరొకరు సంతోషంగా కనిపించారు. అయితే మాజీ లవ్‌బర్డ్స్ విడిపోయార‌ని త‌ర్వాత ధృవీక‌ర‌ణ వ‌చ్చింది.

జార్జియా ఇటీవలి ఇంటర్వ్యూలో అదే విషయాన్ని ధృవీకరించింది. మేము మంచి స్నేహితులుగా ఉన్నాము. నేను అతని పట్ల ఎల్లప్పుడూ ప్రేమ‌ భావాలను కలిగి ఉంటాను.. కానీ క‌లిసి ఉండ‌లేమ‌ని తెలుసు అని చెప్పింది.అర్బాజ్ ఖాన్ – మలైకా అరోరా మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 1998లో పెళ్లి చేసుకున్న ఈ జంట‌ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత అధికారికంగా 11 మే 2017న విడాకులు తీసుకున్నారు.

Exit mobile version