Araku YCP Politics : అరకు నియోజకవర్గంలోని అధికార వైసీపీలో ముసలం మొదలు అయింది. మార్పు చేర్పులో భాగంగా అరకు వైసీపీ ఇంచార్జిగా గొడ్డేటి మాధవి ని అధిష్టానం నియమించింది. అయితే గొడ్డేటి మాధవిని స్థానిక వైసీపీ నేతలు వ్యతిరేకిస్తు న్నారు.లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు అంటూ వారు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
అరకులో ఎంతో మంది సీనియర్ నాయకులు, ఆశవహులు ఉండగా పాడేరుకు చెందిన గోడ్డేటి మాధవిని అరకు ఇంచార్జిగా ఎలా నియమిస్తారని. స్థానిక వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. స్థానికులనే ఇంచార్జిగా నియమించి, సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నాన్ లోకల్ మాధవిని మార్చకపోతే ఖచ్చితంగా ఓడిస్తా మని స్థానిక వైసీపీ నేతలు వైసిపి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద అధికార వైసిపి లో సీట్ల మార్పుపై స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి అభ్యర్థులను మార్చడం వల్ల కొత్త తలనొప్పులు వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఆ నియోజకవర్గంలో క్యాడర్ కలిగి ఉంటారు. అదే పక్క నియోజకవర్గానికి వెళ్తే వారికి క్యాడర్ ఏ విధంగా ఉంటుందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అరకులో ఇదే పరిస్థితి తలెత్తింది. పక్క నియోజకవర్గము చెందిన మాధవిని అరకులో అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తీరు మార్చుకోకపోతే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిక జారీ చేశారు.