Araku : కనువిందు చేస్తున్న అరకు మాడగడ మేఘాల కొండ

Araku
Araku : అల్లూరి ఏజెన్సీలో ఎన్ని పర్యాటక ప్రాంతాలున్నా ఆ వంజంగి మంచు మేఘాలకొండ ప్రత్యేకం. ఆ దృశ్యాలు, కాలికి మేఘాలు తాకుతూ వెళ్తున్నట్టు అనిపించే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ప్రకృతి ఒడిలో ఆ సుందర దృశ్యాలను తిలకించి ఆహ్లాదాన్ని ప్రజలు ఆస్వాదిస్తుంటారు. దీంతో ఇక, చలో అరకు అంటున్నారు. ఎందుకంటే, అంతలా కనువిందు చేసే మరో మేఘాల మాడగడ కొండ రారమ్మని పిలుస్తోంది. దీంతో అరకుకు విపరీతంగా రద్దీ పెరిగింది.
కొండల మధ్య పాల కడలిని తలపించేలా మాడగడలో ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. భూతల స్వర్గాన్ని తలపించే మాడగడ మేఘాల కొండ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో వెళ్లేనే ఈ అందాలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.