Aradhaya Devi : ఎలాంటి పాత్ర అయినా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన బ్యూటీ
Aradhaya Devi as Saree Girl : ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవేం లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం అభిమానులను పలకరిస్తూనే ఉంది. ఇందులో ఇతర భాషల నుంచి అద్దెకు తెచ్చుకుంటున్న వారే ఎక్కువ. వారంతా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ గా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. కొత్త భామలు బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒక ముద్దుగుమ్మే కనిపిస్తుంది. ఆమె ఫస్ట్ మూవీ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. అందంతో కుర్రకారిని కట్టిపడేస్తుంది. అవకాశాలు వస్తే ఎలాంటి పాత్రకైనా రెడీ అంటుంది.. ఆమె ఎవరంటే?
కేవలం ఇన్ స్టాలో ఒక్క రీల్ తో దేశంలో హాట్ బ్యూటీగా మారిపోయింది. ఆమె రీల్ ను చూసిన టాప్ డైరెక్టర్ ఎవరంటూ పెట్టిన మెసేజ్ తో దేశం యావత్తు ఆమె వైపునకే కళ్లు తిప్పింది. దీంతో క్రేజ్ పెరగడమే కాకుండా.. ఆ సంచలన దర్శకుడి ప్రొడక్షన్ లో ఒక సినిమాలో చాన్స్ కూడా కొట్టేసింది. ఆమె ఎవరంటే రామ్ గోపాల్ వర్మ వదిలిన బాణం ఆరాధ్యదేవి. ఈ అమ్మడి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. 23 ఏళ్ల ఈ భామ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అందరి నోళ్లలో, కళ్లలో తిష్టవేసుకుంది.
వర్మ ఈ అమ్మడిని సోషల్ మీడియాలో చూసి ముగ్ధుడయ్యాడు. ఎలాగైనా ఈమెతో సినిమా తీయాలనుకున్నాడు. ఆమెను హీరోయిన్ గా పెట్టి ‘శారీ’ని అనౌన్స్ చేసేశాడు. ఈ సినిమాలో ఆరాధ్యదేవి అందాలను ఓ రేంజ్ లో చూపించేలా దర్శకుడికి సూచనలు చేశాడు వర్మ.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్.. పాటల్లో ఆరాధ్య అందాలతో రెచ్చిపోయింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇన్ స్టా రీల్ లో చీర కట్టులో పద్ధతిగా కనిపించిన ఆరాధ్య.. ఈ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంటే నెటిజన్స్ షాక్ తింటున్నారు. ఇటీవల ఆరాధ్యదేవి మాట్లాడుతూ.. అవకాశం వస్తే ఎలాంటి పాత్రకైనా ఒకే అంటుంది. గ్లామర్ పాత్రలు చేయద్దని నిర్ణయించుకున్నానని, ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని చెప్పింది. గ్లామర్ అనేది పర్సనల్. నాకు, అది వృత్తిలో భాగం. గ్లామరస్‌గా ఉన్నా, లేకపోయినా నటించేందుకు నేను సిద్ధమే అని చెప్పింది.