JAISW News Telugu

Weather Report : వందేళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏప్రిల్ ఉష్ణోగ్రత..మే లో ఊహించలేని వాతావరణం

Weather Report

Weather Report

Weather Report : వేసవి కాలం అంటే సాధారణంగా వాతావరణం వేడిగా ఉంటుంది. మధ్యాహ్నం  నుంచి సాయంత్రం వరకు బయటకు రాలేనంత వేడి ఉంటుంది. ఇది ఎక్కువగా మే మాసంలో కనిపించే వాతావరణం. కానీ ఏప్రిల్ మాసం ముగిసేనాటికే మే వాతావరణం కనబడటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. గడిచిన ఏప్రిల్ ఉష్ణోగ్రత వందేళ్ల క్రితం కనిపించిందని శాస్త్రవేత్తల రికార్డులు చెబుతున్నాయి. అందుకే వారు హెచ్చరిక జారీచేశారు. మే లో అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరో ఐదు రోజులు వాతావరణంలో వేడి తట్టుకోలేని విదంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . గడిచిన సంవత్సరాల కంటే కూడా మే మాసంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఉషోగ్రత పెరుగుతోంది. జనం అధిక వేడివలన తట్టుకోలేకపోతున్నారు. చల్లదనం కోసం తల్లడిల్లిపోతున్నారు. విచిత్రమైన వాతావరణం ఏర్పడబోతోంది. మే నెలలో కనిపించే అత్యధిక వేడి రికార్డు సృష్టించే అవకాశాలు సైతం ఉన్నాయి. చాల ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటిపోయింది. వందేళ్ల కిందట నమోదయిన ఉష్ణోగ్రత ఏప్రిల్,మే మాసాల్లో నమోదు కాబోతోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరింది.

imd రికార్డల ప్రకారం దేశంలో తూర్పు, దక్షణ ద్వీపకల్పం ప్రాంతాల్లో వేడి గాలుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ  ప్రభావం మరో ఐదు రోజులు కనిపించే అవకాశం ఉంది. అధిక వేడితోపాటు వడగాల్పులు సైతం అధికంగా వీచే అవకాశం ఉంది. మరొక విషయం ఏమిటంటే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ ముందు జాగ్రత్తగా తెలిపింది. ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రలతోపాటు కర్ణాటక, ఒడిశా,బెంగాల్,బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంభందిత శాఖ అధికారులు తెలిపారు.

ఇంటిలోనుంచి బయటకు వెళ్ళరాదు. సాధ్యమైనంత మేరకు కిటికీలు,తలుపులు మూసి ఉంచాలి. సిమెంట్ నేలపై పడుకోరాదు. ఎక్కువ నీరు తాగాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. మజ్జిగ,నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి.

Exit mobile version