YS Sharmila:ఏపి సీఎం జగన్,ప్రతిపక్ష నేత చంద్రబాబు కి లేఖలు రాసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కి APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లేఖలు రాశారు. ప్రత్యేక హోదా సహా,విభజన హామీలతో పాటు ఈ 10 ఏళ్లలో బీజేపీ చేసిన మోసాలపై అసెంబ్లీలో చర్చించాలని షర్మిల లేఖలో పేర్కొన్నారు.హామీలు అమలు చేసేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఆమోదించాలని షర్మిల సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని కోరారు. ఆమోదించిన తీర్మానా న్ని కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని లేఖల్లో వైఎస్ షర్మిలా రెడ్డి కోరారు.