AP Volunteers : వాళ్ల మాట విని రాజీనామా చేసి రోడ్డున పడ్డ వాలంటీర్లు
AP Volunteers : ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైంది. ఓటర్లు ఆ పార్టీ నాయకులను దారుణంగా ఛీత్కరించారు. కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. దీంతో ఇంతకాలం రాజభోగాలు అనుభవించి ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వారి ఒత్తిళ్ళు, ప్రలోభాలకు తలొగ్గి 1.08లక్షల మంది వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే నాడు వాలంటీర్లను బెదిరించి, ప్రలోభపెట్టి రాజీనామాలు చేయించిన వైసీపీ నేతలు ఇప్పుడు వారికి మొహం చాటేస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు అయితే అసలు మీ వల్లనే మేము ఓడిపోయామని బండబూతులు తిట్టి పోస్తున్నారు. ఇంటికి వచ్చిన వాళ్లను మెడ పట్టి గెంటినంత పని చేస్తున్నారు. దీంతో పలు జిల్లాలలో వాలంటీర్లు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి మళ్లీ తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వినతి పత్రాలు అందజేసి వేడుకుంటున్నారు.
కనీసం ఈ జీతాలు కూడా లేకుంటే రోడ్డున పడతామని అందుకే వాలంటీర్లుగా వైసీపీ నేతలు చెప్పిన ప్రతీ పనీ చేయక తప్పలేదని వాపోతున్నారు. కానీ నామమాత్రపు జీతం ఇస్తూ తమని ఐదేళ్ల పాటు వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకూడదనే ఈసీ ఆంక్ష విధించినందున వైసీపీ నేతలు వారిచేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుండగా, చంద్రబాబు వారిని వారించారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దని, తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తెలిపారు. కొత్త ప్రభుత్వం రాగానే వారి జీతాలు నెలకు రూ.10 వేలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు. చంద్రబాబు హామీని నమ్మిన సుమారు 50 వేలమంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేయలేదు. వైసీపీ నేతలని నమ్ముకున్నవారు మాత్రం రోడ్డున పడ్డారు. ఆనాడు జగన్ తెలంగాణలో తనని నమ్ముకున్న వైసీపీ నేతలను, కార్యకర్తలని ఇలాగే రోడ్డున పడేశాడు. తల్లిని, చెల్లిని వైసీపీ కోసం వాడుకొని అధికారం రాగానే గెంటేశాడు. రెండేళ్ల తర్వాత సగం మంది మంత్రులు అసమర్ధులంటూ పదవిలోని తీసేశాడు. ఇప్పుడు వాలంటీర్లను కూడా రోడ్డున పడేశారు.