AP SSC Results 2024 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల – 17 పాఠశాలల్లో అందరూ ఫెయిల్
AP SSC Results 2024 : ఏపీలో పదోతరగతి పరీక్షల ఫలితాలు ఈరోజువిడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించగా, 6,16,615 మంది విద్యార్థులు రాశారు. టెన్త్ ఫలితాల్లో మొత్తం 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలుర కన్నా బాలికలే ఎక్కువ సంఖ్యలో పాసయ్యారు. 96.37 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో 2,803 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. కాగా 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదని చెప్పారు. ఈ 17 పాఠశాలల్లో ఒక్కటే ప్రభత్వ పాఠశాల ఉందని ఆయన వెల్లడించారు.