JAISW News Telugu

AP Report : ఏపీలో పార్టీ పరిస్థితిపై నివేదిక బీజేపీకి చేరిందా?

AP Report

AP Report in Bjp

AP Report : ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎవరిది అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ప్రస్తుత వాతావరణంలో సర్వేలపై నమ్మకం తక్కువ. ఒక్కో పార్టీకి ఒక్కో సర్వేలు, విశ్వాసం ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలు చెప్పేవి, ఏమనుకుంటున్నాయనేది కీలకంగా మారుతోంది.

ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే దానిపై బీజేపీ కేంద్ర నేతలకు సీక్రెట్‌ రిపోర్ట్‌ ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నివేదికను ప్రముఖ సైఫాలజిస్ట్ అయిన మాజీ ఎంపీ అందించారు. మూడు దశాబ్దాల క్రితమే రాజకీయ సర్వేలను దేశానికి పరిచయం చేసిన ఆయన.. అప్పటి నుంచి అందులో పాలుపంచుకుంటున్నారు.

బీజేపీ అగ్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన ఆయనకు ఏపీలోని అన్ని రంగాలపై అవగాహన ఉంది. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత తానే స్వయంగా పోస్ట్ పోల్ సర్వే నిర్వహించి కేంద్ర నేతలకు నివేదించినట్లు సమాచారం. తన నివేదికలో పొత్తు అవకాశాలను, వైసీపీకి ఉన్న అవకాశాలను స్పష్టంగా వివరించినట్లు చెబుతున్నారు.

ఈ నివేదిక ఆధారంగా ఏపీలో రాజకీయ పరిణామాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరించడంతో పాటు వైసీపీ పనితీరును కూడా క్షుణ్ణంగా విశ్లేషించినట్లు సమాచారం. బీజేపీకి సంబంధించి గతంలో ఆయన చేసిన సర్వేలు కచ్చితమైనవే కాబట్టి ఆయన నివేదికపై కేంద్ర పెద్దలకు నమ్మకం ఉంది.

ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియనప్పటికీ, ఒక రాజకీయ పార్టీ ప్రమాణ స్వీకారోత్సవానికి తేదీని ఫిక్స్ చేస్తోంది. ఈ నివేదిక సాధారణ సర్వేలను మించిపోయింది. ఈ నివేదికలోని అంశాలు సస్పెన్స్‌గా ఉన్నాయి, విజేతను ఊహించడం కష్టం. నివేదిక వివరాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఇంకా వెల్లడి కాలేదు.

Exit mobile version