AP Polycet Results : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

AP Polycet Results

AP Polycet Results

AP Polycet Results : ఆంధ్రప్రదేశ్ లో పాలిసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 27న పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1.42 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో 1.24 లక్షల మంది అర్హత పొందారు. 87.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో బాలికలు 89.81 శాతం (50,710), బాలురు 86.16 శాతం (73,720) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రవేశ పరీక్షలో పొందిన మొత్తం మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు మొత్తం 267 ఉండగా, వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్ తేదీలకు సంబంధించిన ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు.

TAGS