YS Sharmila Rally : కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెంట రాజకీయం తిరుగుతన్నట్లు కనిపిస్తుంది. గతంలో తెలంగాణలో పెట్టిన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు బహుమతిగా ఏపీ బాధ్యతలను అప్పగించింది. కొన్ని రోజులుగా కుమారుడు రాజారెడ్డి వివాహం ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని ఆమె అవన్నీ ముగించుకొని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. పార్టీని ఎలాగైనా ప్రభుత్వంలోకి తేవాలని కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ AP PCC చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు ఆమె విజయవాడలో భారీ కాన్వాయ్ తో వెళ్తున్నారు. అయితే పోలీసులు ఆమె కార్యకర్తలను అడ్డుకొని అనుమతి లేదంటూ నిలువరించారు. దీంతో కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్న చోటనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అన్నారు. తమను అడ్డుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని అడ్డుకున్నట్లు కాదని అన్నారు. పార్టీ చాలా వేగంగా ప్రజల మనసుల్లోకి వెళ్లిందని చెప్పారు.
విజయవాడలో ర్యాలీని అడ్డకున్న సమయంలో కార్యకర్తలు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న వారు అప్పుడు మీరే ఉంటారని బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్న ఘట్టాలను జైస్వరాజ్య టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ వీడియో మీ కోసం.