JAISW News Telugu

CM Chandrababu : ఇంకా ఆయన మత్తులోనే ఏపీ పోలీసులు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే.  కొందరిపై కావాలనే  రాజకీయ ప్రేరేపిత కేసులు కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలను అణగదొక్కాలని ప్రయత్నించిన సందర్భాలు కోకొల్లలు. చాలామంది టీడీపీ నేతలపై లెక్కలేనన్ని కేసులు పెట్టారు. ఇదేందని ప్రశ్నిస్తే కేసు, దాడిని ప్రతిఘటిస్తే కేసు.. ఇలా ఒకటేమిటి గత ఐదేళ్లలో చిత్రవిచిత్రాలు చేసుకున్నాయి. ఒక దళిత మహిళగా ఉన్న తాజా హోం మంత్రి వంగలపూడి అనిత పై ఏకంగా అట్రాసిటీ కేసు పెట్టారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతి జిల్లాలో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఇటువంటి రాజకీయ ప్రేరేపిత కేసుల విషయంలో చంద్రబాబు అప్రమత్తం అయ్యారు. అటువంటి కేసులను ఎత్తివేయాలని.. టీడీపీ శ్రేణులపై నమోదు చేసిన రౌడీషీట్లను తొలగించాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశఆరు. నిజమైన రౌడీ షీటర్లు, సంఘవిద్రోహశక్తుల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంకా కొంతమంది అధికారులు వైసీపీ మత్తులోనే ఉన్నారని అది వదిలించుకోవాలన్నారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న పోలీసులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 2019కి ముందు తన మీద ఎలాంటి కేసులు లేవని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 కేసులను నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాజీ సీఎం హోదాలో ఉన్న తనపై రెండు హత్యయత్నం కేసులు పెట్టడాన్ని ప్రస్తావించారు. తన పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో భాగంగా టీడీపీ శ్రేణులపై పెట్టిన రౌడీషీట్లు తక్షణం ఎత్తివేయాలని పోలీస్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇకముందు రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టకూడదని కూడా సూచించారు.

Exit mobile version