JAISW News Telugu

AP Govt Good News : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మెగా డిఎస్సీకి కేబినెట్ ఆమోదం

AP Govt Good News

AP Govt Good News

AP Govt Good News : ఏపీ కేబినెట్ సోమవారం తన మొదటి సమావేశాన్ని  మొదలు పెట్టింది. ఎన్నికల హామీలను నెరవేర్చడం, అమరావతి రాజధాని ప్రాజెక్టు పునఃప్రారంభం, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, పెరిగిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణి వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. రాజధాని అమరావతిలోని వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు ఫైళ్లపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫైళ్లలో మెగా డీఎస్సీ, భూ పట్టాదారు చట్టం రద్దు, పెన్షన్ మొత్తాన్ని రూ.4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డీఎస్సీ షెడ్యూల్‌ను అధికారులు చంద్రబాబు కేబినెట్ ముందు ఉంచడంతో  మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను సమావేశంలో ఆమోదించారు. డిఎస్సీ నిర్వహణ ప్రక్రియ వచ్చే నెల 1న ప్రారంభం అవుతుంది. మొత్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఈ మెగా డిఎస్సీకి సంబంధించిన షెడ్యూల్ డిసెంబర్ 2024 నాటికి ముగుస్తుంది.  

 మెగా డీఎస్సీకి మంత్రివర్గ ఆమోదం తెలపడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.  గతంలో మంత్రులెవ్వరూ తమని సచివాలయంలోకి అనుమతించక పోగా వినతులు కూడా తీసుకునే పరిస్థితి లేదన్నారు నిరుద్యోగ యువత. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల సమక్షంలోనే డీఎస్సీ విధి విధానాలపై సంతకం పెట్టడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. యువత సమస్యలు తెలిసిన నాయకుడు అధికారంలోకి రావటం పట్ల నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.  ఇచ్చిన హామీకి కట్టుబడ్డారంటూ లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version