JAISW News Telugu

AP Government Caste Census : కులగణనకు సిద్ధమవుతున్న ఏపీ సర్కారు.. కావాల్సిన వివరాలివే..

AP Government Caste Census

AP Government Caste Census : ఏపీలో నవంబర్ 27 నుంచి కులగణన ప్రారంభం కాబోతున్నది. గ్రామం, వార్డు పరిధిలో సచివాలయం సిబ్బందితో, సచివాలయం పరిధిలో వలంటీర్లతో ఈ కులగణన నిర్వహించబోతున్నది. దీని కోసం నవంబర్ 16 న కులగణన కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.  అయితే ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా 5 చోట్ల ప్రారంభమైంది.

అయితే ఈ సందర్భంగా సర్వేలో ఈ రకమైన సమాచారం సేకరించబోతున్నది.  ఆ గ్రామం పరిధిలో కుటుంబం అందుబాటులో ఉందా.. మరణించిన వ్యక్తుల వివరాలు సేకరిస్తారు. దీంతో పాటు జిల్లా, జిల్లాకోడ్ మండలం, మున్సిపాలిటీ, పంచాయతీ, పంచాయతీ కోడ్, వార్డు నంబర్ వివరాలను నమోదు చేస్తారు.  దీంతో పాటు కుటుంబం పెద్ద ఆధార నంబర్ సేకరిస్తారు. కుటుంబ సభ్యుల వివరాలు, పెద్దతో ఉన్న సంబంధం, రేషన్ కార్డు నంబర్ ను సేకరిస్తారు. ఇక ఇల్లు ఎలా ఉందో నమోదు చేస్తారు. ప్రస్తుత చిరునామా కూడా ఎంటర్ చేస్తారు. పక్కా ఇల్లు, బిల్డింగ్, గుడిసె, డుప్లెక్స్ ఇల్లు ఇలా అన్ని వివరాలు సేకరిస్తారు. టాయిలెట్ ఫెసిలిటీ ఉందా లేదా అని చూస్తారు. తాగునీరు సదుపాయం, వ్యవసాయ భూమి, నివాస భూమి ఇలా ప్రతి వివరాలు ఎంటర్ చేస్తారు.

ఈ సందర్భంగా ప్రతి వ్యక్తి వివరాలు చేసేటప్పుడు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్లలోపు వారికి మాత్రం మినహాయించారు. అయితే ఇక్కడ సర్వే పూర్తి చేసిన తర్వాత వలంటీర్ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అప్పుడే అది ఫైనల్ సబ్ మిట్ అవుతుంది. ఇలా ప్రస్తుతానికి ఐదు చోట్ల ఈ సర్వే నిర్వహించేందుకు  వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Exit mobile version