AP Elections 2024 : ట్రెండింగ్ లో ఏపీ ఎలక్షన్స్..ట్వీట్లతో హోరెత్తించిన పార్టీలు

AP Elections 2024

AP Elections 2024

AP Elections 2024 : చెదురు ముదురు సంఘటనల మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం పూర్తయింది. మార్పుకోసం జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లేసేందుకు జనాలు ఉదయం ఆరుగంటల నుంచే భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలకు, దాడులకు దిగుతున్నా ఓటర్లు మాత్రం బెదరకుండా ఓటేసేందుకే మొగ్గు చూపారు.  

ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చేస్తున్న అరాచకాలను వీడియోలతో సహా పోస్ట్ చేస్తూ దీన్నిబట్టి అందరూ ఓటు వేయాలంటూ పలువరు పిలుపు నిచ్చారు. ట్విటర్ లో నిన్న మొత్తం ‘హలో ఏపీ బై బై వైసీపీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది. ఇండియా ట్రెండ్స్‌లో ‘#APElections2024’ టాప్‌లో ఉంది. దాని తర్వాత ‘#HelloAP_ByeByeYCP’ నిలిచింది. మూడో స్థానంలో ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరిలో ‘ఓట్‌ఫర్‌గ్లాస్‌’, రాజకీయ విభాగంలో చంద్రబాబు నాయుడు టాప్‌లో నిలిచారు. #TDPJSPBJPWinningAP, #YCPLosingBig హ్యాష్ ట్యాగ్స్  కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇక ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేరోజు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జరిగిన పోలింగ్‌లో ఎక్కువ శాతం మంది ఓటు వేయడంతో ఎన్నికల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాజకీయ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

TAGS