AP Elections 2024 : ఏపీలో ఎన్నికల రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పుడు రాజకీయమంతా ఢిల్లీకి చేరింది. బీజేపీని కలుపుకోవడానికి టీడీపీ, జనసేన అధినేతలు హస్తినకు వెళ్తే.. వివిధ పథకాలకు నిధుల కేటాయింపులపై జగన్ సైతం అక్కడికే బయలుదేరారు. ఈ కీలక ఢిల్లీ యాత్ర తర్వాత ఏపీ పాలిటిక్స్ మరింత ఊపందుకోనున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో జనాలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. వారి నాడిని పట్టేందుకు పలు సర్వేలు ఇప్పటికే తమ నివేదికలను వెల్లడించాయి. మరికొన్ని సంస్థలు సర్వేల పనిలో పడ్డాయి. అయితే ఈ సర్వే సంస్థల్లో దేశంలోనే నమ్మదగినవి రెండే సర్వే సంస్థలు అని అందరూ చెబుతుంటారు. వీటి అంచనాలు దాదాపు కరెక్ట్ అవుతుంటాయి. అవే మై యాక్సిస్ ఇండియా, సీఓటర్ సర్వే సంస్థలు. ఇవి ఇచ్చే సర్వే ఫలితాలపై జనాలు విశ్వాసం ఉంచుతారు.
ఈ సంస్థలు ఇచ్చిన ఫలితాల్లో ఏపీలో టీడీపీ ప్రభంజనం ఖాయమని తేల్చాయి. టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందని అంచనా వేసింది. నిజానికి ఏపీలో రాజకీయ పరిస్థితులన్ని ఓ పార్టీ కోణంలో కాకుండా నూట్రల్ గా మనం ఆలోచించినా రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి అసలు చాన్సే ఉండదు అనే విషయం అర్థమైపోతుంది.
అధికార మత్తులో జగన్ రెడ్డి తల్లిని, చెల్లిని దూరం చేసుకున్నారు. ఇక ప్రజలకు దూరం కాకుండా ఉంటారా? అహంకారంతో చేసిన పాలనతో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. జగన్ రెడ్డి బటన్ నొక్కాను..అని పదేపదే చెబుతున్నా.. ఆ బటన్ల ద్వారా ప్రజలకు ఒరిగిందానికన్నా.. జగన్ రెడ్డి వారి నుంచి గుంజుకున్నదే ఎక్కువ అని జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ విషయాన్నే సర్వే సంస్థలు తమ అంచనాల్లో కోడైకూస్తున్నాయి.
ఐదేండ్లు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ఏం చేశారో చెప్పుకోవడం లేదు..బటన్లు మాత్రమే నొక్కానని చెబుతున్నారు. అదే టైంలో కక్ష సాధింపులతో ఆయన చేసిన రాజకీయం ప్రజల్లో వెగటు పుట్టించింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే భావన లేకుండా పోలీస్ వ్యవస్థను చెరబట్టి ప్రజలు ఎలా బతకాలన్న భయాన్ని సృష్టించారు. దాని ద్వారా వారు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో సర్వే సంస్థలు చెబుతున్నాయి.
ఇక జగన్ రెడ్డి నిర్వాకాలు ప్రజలు ఐదేండ్లు గమనించారు. వీరి తరపున ప్రతిపక్ష టీడీపీ ప్రతీ సమస్యపై పోరాడుతూనే వచ్చింది. దానికి జనసేన తోడైంది. ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత క్షేత్రస్థాయిలో టీడీపీ ఎంతో మెరుగుపడింది. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇదే ప్రజాభిప్రాయం రేపటి ఎన్నికల్లో ప్రతిబింబించబోతోంది. టీడీపీ ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దాని పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాకంటక పాలనను తుదముట్టించే వరకు పోరాడుతూనే ఉంటుంది.