AP Election Schedule : ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. పోలింగ్ తేదీతో పాటు, కౌంటింగ్ తేదీకి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రజలు ఈగల్ గా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది.
సోషల్ ప్లాట్ ఫారమ్‌లలో ట్రెండింగ్‌లో ఉన్నటువంటి నివేదిక ఏమిటంటే, మార్చి 12న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏప్రిల్ 19న పోలింగ్, మే 22న కౌంటింగ్ జరుగుతుంది. ఈ నివేదిక సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. చాలా మంది ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి అధికారికంగా అనౌన్స్ అయ్యిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనికి సంబందించి మెమో అంటూ ఒక లెటర్ ను చూపిస్తున్నారు. అయితే, పోలింగ్ మరియు కౌంటింగ్ రోజులతో సామాజిక వేదికలపై వ్యాపిస్తున్న మెమో నకిలీదని ఈసీ ఖచ్చితంగా నిర్ధారిస్తూ ఈ నివేదికలను ఖండించింది.
“#Lok Sabha Elections 2024 షెడ్యూల్‌కు సంబంధించి వాట్సప్ లో నకిలీ సందేశం షేర్ చేయబడుతోంది. సందేశం ఫేక్. #ECI ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి తేదీలు ప్రకటించబడలేదు. ఎన్నికల షెడ్యూల్‌ను కమిషన్ మీడియా సమావేశం ద్వారా ప్రకటించింది. ఈ సోషల్ మీడియా పోస్ట్‌లలో వాస్తవం లేదని ఈసీ ట్వీట్ చేసి ధృవీకరించింది. అయితే ఈసీ కీలకమైన తేదీలతో ఒక వారంలో నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉన్నందున అప్పటి వరకు వెయిట్ చేయకతప్పదు.