AP Debt 10 Lakh Crores : ఏపీ అప్పు రూ. 10 లక్షల కోట్లు.. పోలవరం, రాజధానికి చిల్లిగవ్వ లేదు..
AP Debt 10 Lakh Crores : ఏపీ ప్రభుత్వం అప్పు అంతకంతకూ పెరుగుతున్నది. ప్రస్తుతం పది లక్షల కోట్ల అప్పు రాష్ర్ట ప్రభుత్వం చేసింది. అయితే వీటిలో రెండున్నర లక్షల కోట్లు కేవలం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకే కేటాయించినట్లు రాష్ర్ట సర్కారు చెబుతున్నారు. అయితే మొత్తంగా ప్రభుత్వం చేసిన ఈ అప్పుకు సంబంధించి ఎక్కడ ఖర్చు పెట్టారంటే మాత్రం లెక్కలు తెలియడం లేదు. నిజానికి ప్రభుత్వం చేసిన ఈ రూ. 10 లక్షల కోట్లు అభివృద్ధి కి ఖర్చు పెడితే రాష్ట్రం ఎప్పుడో సస్యశ్యామలమయ్యేది.
రాష్ర్టంలో రాజధాని అమరావతి నిర్మాణం ప్రాజెక్టును జగన్ సర్కారు అటకెక్కించింది. అసలు నిధులెక్కడున్నాయని స్వయాన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. అయితే అమరావతి నిర్మాణం అటుంచితే రాష్ర్టంలోనే కీలక ప్రాజెక్టు పోలవరానికి ఏమైనా ఖర్చుపెట్టారా అంటే అదీ లేదు. కనీసం చిల్లిగవ్వ కూడా వెచ్చించలేదు. కనీసం రూ, 30 వేల కోట్లయినా ఇందులో పెట్టుంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది.
ఇలాంటిదేమీ చేయకుండానే అప్పు మాత్రం రూ. 10 లక్షల కోట్లు చెసేశారు. ఏపీ ప్రజల పేరిట చేస్తున్న ఈ అప్పులకు సంబంధించి సొమ్ము ఎక్కడికెళ్లిందని ఆ రా తీస్తే కేవలం ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లిందనే అభిప్రాయం వినిపిస్తున్నది. అయితే ప్రతిపక్ష నేతపై నిందలు వేస్తూ, తాము చేస్తున్న అవినీతిని మాత్రం జగన్ సర్కారు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది.
మరోవైపు రాజధాని, పోలవరం లాంటి వాటిని జగన్ సర్కారు అసలు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాకముందు ఏడాదిలో పోలవరం పూర్తి అన్నారు. ఆ తర్వాత రెండేళ్లు.. నాలుగేళ్లు అంటూ ఉన్న పదవి కాలం కాస్తా పూర్తి చేశారు. ఇక మళ్లీ అధికారం ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే ఇదం తా పక్కన పెడితే తాను పరిపాలన చేసేందుకని మాత్రం రూ. 500 కోట్లతో ఓ ప్యాలెస్ ను కట్టించుకున్నారు. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా రుషికొండపై తనకు అనుకూలంగా ఓ పెద్ద భవనాన్ని మాత్రం రాజభోగాలుండే ప్యాలెస్ లా తీర్చిదిద్దుకుంటున్నారు.
ప్రజా అవసరాలు మాత్రం కానరాని సర్కారుకు సీఎం ఉండేందుకు మాత్రం ఇంద్రభవనం సిద్ధం చేయిస్తున్నారు. ఏదేమైనా ఏపీలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి ఉంది. ప్రజల సొమ్మునే తిరిగిస్తూ, సంపద సృష్టి లేకుండా తానేదో గొప్ప చేసినట్లు చెప్పుకోవడం కేవలం ఏపీ సర్కారుకే సాధ్యమైందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నది.