AP CM Jagan : ఏపీ సీఎం వర్క్ ఫ్రమ్ ప్యాలెస్..ఇలా చేసే కేసీఆర్ ఇంటికి..రేపు జగన్ కూడా..
AP CM Jagan : పాలకులు అంటే ప్రజల్లో ఉండాలి. వారిని స్వయంగా కలిసి వారి బాధలెంటో తెలుసుకోవాలి. అప్పటికప్పుడు పరిష్కరించాలి. అప్పుడే ప్రజల్లో తమ కోసం తమ పాలకుడు ఉన్నాడు అనే భరోసా కలుగుతుంది. అటువంటి వారిని మళ్లీ మళ్లీ గెలిపిస్తారు. మరి ప్రజలను కలువని పాలకుడిని ప్రజలకు ఎందుకు భరిస్తారు?
వైసీపీ అధినేత జగన్ రెడ్డి అధికారంలోకి రావడానికి పదేళ్లు జనంలో తిరిగారు. పొలాల్లోకి వెళ్లారు. బురదలో దిగారు. రోడ్లపై పడుకున్నారు. పాదయాత్ర చేశారు. పిల్లాడి నుంచి పండుముదుసలి వరకు దగ్గరికి తీసుకుని వారిని ఓదార్చారు. ప్రతీ పదహేను రోజులకే ఓ యాత్ర చేసేవారు. నిత్యం ఏదో జిల్లాలో పర్యటించేవారు. ఇక ఆయన కష్టం ఫలించి అధికారం వచ్చింది. ఆ తర్వాత ఆయనేం చేశారు. ప్యాలెస్ కట్టుకుని అందులో ఉండిపోయారు. కనీసం ప్రజల్ని పలకరించేందుకు కూడా ఐదేండ్ల పాటు బయటకు రాలేదు.
తనను అధికారంలోకి తీసుకొస్తే మీకష్టనష్టాల్లో ప్రతీక్షణం తోడుంటానని జగన్ రెడ్డి ప్రజలను నమ్మించారు. ఊరికో ప్యాలెస్ కట్టుకుని వాటిలో ఉండడం లేదని నమ్మబలికారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన పూర్తిగా ప్యాలెస్ కే పరిమితమయ్యారు. తాడేపల్లిలో ఉత్తగోడలతో ఆయన నిర్మించుకున్న ప్రైవేట్ నివాసానికి 200కోట్లు పెట్టి అదనపు హంగులు సమకూర్చుకున్నారు. ప్రైవేట్ ఇంటికి ఇలా ఖర్చు పెట్టేందుకు ఏ సీఎం అయినా మొహమాటపడుతారు. కానీ జగన్ అలా కాదు కదా. ప్రజలు తనకు ఓటు వేసింది ప్రజల సొమ్ము వాడుకోవడానికే అన్నట్టుగా వ్యవహరిస్తారు కదా.
పనిచేయని బటన్లు నొక్కడానికి తప్ప.. ఎప్పుడూ జిల్లాలకు వెళ్లలేదు. తన సామాజిక వర్గ నేతల చావులకు, పెళ్లిళ్లకు మాత్రం వెళ్లారు. సాధారణంగా ఏ సీఎం అయినా ప్రజలను కలవకపోతే ఫీల్ అవుతారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తనకు తాను చక్రవర్తిగా ఫీల్ అవుతారు. తాను ప్రజలను కలవడమేంటి అని పట్టనట్టు ఉంటారు. అందుకే అప్పట్లో సలహాదారు అత్యుత్సాహంతో ప్రజాదర్బార్ అనే కార్యక్రమం పెడితే చివాట్లు పెట్టి మరీ క్యాన్సిల్ చేశారు. ఇక ఐదేళ్లుగా జగన్ వర్క్ ఫ్రమ్ ప్యాలెస్ చేస్తున్నారు. కేబినెట్ సమావేశాలకు తప్ప సచివాలయానికి వచ్చింది కూడా లేదు.
ఇక తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా ఇలాగే చేసేవారు. ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లో ఉండి పాలించారు. ఎన్నడూ ప్రజలను కలువలేదు. అదే ఆయన పార్టీ కొంప ముంచింది. ప్రజలను కలువలేని సీఎం మాకేందుకు అనుకున్నారు..ఎన్నికల్లో తగిన నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ రెడ్డికి ఏపీ ప్రజలు అదే తీర్పు ఇవ్వబోతున్నారు. తాను చేసిన పాలన సక్కంగా ఉంటే ప్రజల్లోకి వెళ్లేవారేమో..కానీ అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి పావలా, అర్ధ పంచడం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదు.