
AP CM Chandrababu
AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హస్తినలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొందరు కేంద్ర మంత్రులను కలువనున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. అమరావతికి నిధుల సాయంపై చర్చించనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశంలో విశాఖ రైల్వే జోన్, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.