AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల లో శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి దయ వల్లే ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నానని అన్నారు. తెలుగు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. తెలుగు జాతిని ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు సర్వ శక్తుల ప్రయత్నిస్తానని అన్నారు.
అలిపిరి వద్ద జరిగిన దాడి ఘటనలో తాను ప్రాణాలతో బయట పడ్డనంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయని.. ఇంకా ఎంతో మందికి సేవ చేసే భాగ్యం ఆయన తనకు కల్పించారని అన్నారు. కుటుంబ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందన్నారు. కుటుంబాల్లో ఉండే రిలేషన్స్ వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు నిలదొక్కుకోగలుతారన్నారు. నాకు కూడా కుటుంబం జైల్లో ఉన్నప్పుడు ఎంతో అండగా నిలబడిందన్నారు. తెలుగు ప్రజలు కూడా తనకు ఎంతో సపోర్టు చేశారని గుర్తు చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పై ఆటలాడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు.
శ్రీవారి ఆలయం ఉండే తిరుమల ప్రాంతంలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా దొరికేలా చేశారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. అలాంటి వారికి తగిన శిక్ష పడింది. కక్ష సాధింపు చర్యలు తీసుకునే అవసరం లేదు. ఏపీ అభివృద్ధి తమ లక్ష్యమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
వాటిని ముందు పూర్తిచేయాలి. రాజధాని నిర్మాణానికి చాలా ఆర్థిక వనరులు అవసరం కాబట్టి సంపద సృష్టించాలి. ప్రజలకు ఉపాధి మార్గాలను పెంచాలి. కొత్త కంపెనీలను పెట్టుబడుల కోసం ఆహ్వానించాలి. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేస్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో ఉన్న ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తానని చెప్పారు. గతంలో ఎక్కువగా పాలన మీద దృష్టి పెట్టి కుటుంబాన్ని పట్టించుకునే వాడిని కాదన్నారు. ఇప్పుడు మాత్రం కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.