JAISW News Telugu

AP CID Kidnap : ‘ఏపీ సీఐడీ’ కిడ్నాప్ ముఠా అరెస్ట్.. పోలీస్ వర్గాల్లో సంచలనం

AP CID Kidnap

AP CID Kidnap, AP Police

AP CID Kidnap : ఏపీ సీఐడీ ఎంత అరాచక శక్తిగా మారిపోయిందో ఇటీవలి సంఘటనలు చూస్తే కనిపిస్తూనే ఉంది. ఈ అరాచక శక్తిగా వచ్చిన పేరును ఉపయోగించుకుని ఏపీ పోలీసులే కిడ్నాప్ ముఠాగా ఏర్పడి కిడ్నాప్ లు ప్రారంభించారు. ఓ ముఠా హైదరాబాద్ లో పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీ పోలీసుల తీరును క్రిమినల్స్ గా మారిన రక్షక భటుల వ్యవస్థ తీరును కళ్లముందు ఉంచుతోంది. హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. చాలా ఫిర్యాదులు వచ్చాయని.. కంపెనీ ఓనర్ ను అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి తీసుకెళ్లారు.

తర్వాత అతన్ని ఓ చోట బంధించి పది కోట్లు డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందడంతో సైబరాబాద్ పోలీసులు చురుకుగా వ్యవహరించి కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారు. కిడ్నాప్ ముఠాలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ప్రస్తుతం కర్నూలు డీఐజీ ఆఫీసులో ఎస్సైగా పనిచేస్తున్న సృజన్ గా గుర్తించారు. ఏపీ పోలీసు శాఖలో మాజీ ఉద్యోగి రంజిత్ తో కలిసి సీఐడీ పేరుతో కిడ్నాప్ ముఠాగా మారి కోట్లు వసూలు చేస్తున్నారు. వీరి వివరాలను సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు.

ఏపీసీఐడీ అధికారులు ఇలా ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయో కూడా చెప్పకుండా మనుషుల్ని కిడ్నాప్ చేసినట్లుగా అరెస్ట్ లు చేసినట్లుగా చేసి తీసుకెళ్లడం కామన్ అయిపోయింది. దీన్ని ఉపయోగించుకుని ఏపీలో ఎస్సై స్థాయి ఉద్యోగే ఇలా ముఠాగా ఏర్పడి కిడ్నాప్ లు చేయడం సంచలనంగా మారింది. ఏపీ పోలీసుల పరువు మరోసారి బజారునపడినట్లైంది.

Exit mobile version