Ambani wedding : అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు హాజరైన ఏపీ దిగ్గజాలు
Ambani wedding : ప్రపంచ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా అతిరథ మహారథులు హాజరవుతున్న విషయం తెలసిందే. ఈ వ్యాపారం దిగ్గజం కుమారుడ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు ఏపీ దిగ్గజాలైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్‌లకు అంబానీ కుటుంబం నుంచి ఆహ్వానం అందడంతో శనివారం (జులై 13) నాడు ముంబైకి చేరుకుననారు .జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. అంబానీ ఇంట్లో జరుగుతున్న వేడుకలకు బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ మళ్లీ కలిసి హాజరయ్యారు. రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులతో పాటు దేశంలోని ప్రముఖ సినీనటులు వేడుకకు హాజరయ్యారు.
అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన వేడుక ఇదేననే చర్చ జరుతున్నది. దేశ, విదేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, హాలీవుడ్ సెలబ్రిటీలు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మూడు రోజుల పెళ్లి వేడుకలకు తరలివచ్చారు. జులై 12న అనంత్, రాధికల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం అనంత్, రాధికలకు ఆశీస్సులు అందించే శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లను ఏపీ సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. టీడీపీ అధినేత వారిని భుజంతట్టి, కాసేపు మాట్లాడారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అంబానీ స్వాగతం
అనంత్ అంబానీ – రాధికా మర్చంచ్‌ల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌ను ఆప్యాయంగా పలకరించి కొంత సేపు వారితో ముచ్చటించారు. రాత్రికి నారిమన్ పాయింట్ లోని ఓబెరాయ్ హోటల్లో చంద్రబాబు దంపతులు బస చేశారు .ఆదివారం ఉదయం ముంబైలోని మఖేష్ అంబానీకి చెందిన నివాసం ఆంటీలియాలో ఫంక్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.