JAISW News Telugu

AP Cabinet meeting : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. నూతన మద్యం విధానానికి ఓకే

FacebookXLinkedinWhatsapp
AP Cabinet meeting

AP Cabinet meeting

AP Cabinet meeting : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

వాలంటరీలను, గ్రామ సచివాలయ సిబ్బందిని ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్రంగా చర్చించి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సమావేశం నిర్ణయించింది. వాలంటీర్లు సచివాలయాలకు దినపత్రికల కొనుగోలుకు ప్రతి నెల ఇచ్చే రూ.200 రద్దు. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యూవల్ చేయలేదని మంత్రులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

మొత్తం 18 అంశాలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం, ఇటీవల ఏపీలో వరదల వల్ల పంటలకు జరిగిన నష్టంపై కౌలు రైతులకు పరిహారం దక్కేలా చూడాలని నిర్ణయించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని, మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.

Exit mobile version