
Telangana IAS officers
Telangana IAS officers : డీవోపీటీ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ లు ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగుతామని క్యాట్, హైకోర్టులను ఆశ్రయించినా ఊరట దక్కలేదు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఐఏఎస్ లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన ఐఏఎస్ లు సృజన, హరికిరణ్, శివశంకర్ లు ఏపీ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయి తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్టు చేశారు.