Anupama Parameswaran : ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోయిన్స్ లో అందం తో పాటు మంచి టాలెంట్ ఉన్న వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్. మలయాళం సినిమాలతో కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత ‘అ..ఆ’ అనే సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ తొలి సినిమాతోనే ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె చేసింది నెగటివ్ రోల్ అయ్యినప్పటికీ కూడా ఆ రేంజ్ క్రేజ్ రావడం, హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు.
కుర్రకారులో ఆమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఏ కుర్రాడైన అనుపమ పరమేశ్వరన్ లాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే బాగుండును అని అనుకుంటారు. ఆ రేంజ్ అందం ఆమె సొంతం. ఆమె ఎవరితోనైనా రొమాన్స్ సన్నివేశాల్లో నటిస్తే ఫ్యాన్స్ అసలు తీసుకోలేరు. దీన్ని బట్టీ ఆమెని యూత్ ఆడియన్స్ ఎంతలా దగ్గర తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె రవితేజ హీరో గా నటించిన ‘ఈగల్’ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారక్టర్ చేసింది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ లో అనుపమ పరమేశ్వరన్ ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కి రాఖీ కట్టిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముందుగా అనుపమ కార్తీక్ ని అన్నయ్యా అని పిలవడాన్ని గమనించిన రవితేజ మాట్లాడుతూ ‘ఏంటి కార్తీక్ ని అన్నయ్య అని పిలిచావా?, వద్దు అంత పని చెయ్యకు, నీ మంచి కోసమే చెప్తున్నాను’ అని అంటాడు రవితేజ.
అప్పుడు అనుపమ మాట్లాడుతూ ‘నేను కార్తీక్ తో కలిసి నాలుగు సినిమాల్లో పనిచేసాను. మొదటి నుండి నేను అతన్ని అన్నయ్యా అని పిలుస్తూ ఉంటాను. అది నాకు బాగా అలవాటు, ఇప్పుడు ఆ అలవాటు ని మార్చుకోలేను’ అని అంటుంది. ఇది విన్న యాంకర్ సుమ ‘ఇదిగో రాఖీ కట్టు’ అని రాఖీ తెచ్చి ఇవ్వగా అనుపమ రాఖీ కడుతుంది. ఈ విషయం పై సోషల్ మీడియా లో ఇప్పుడు కార్తీక్ పై ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రపంచం లో ఎవ్వడైనా అనుపమ ని చెల్లి గా బావిస్తాడా ?, నువ్వు ఎక్కడ నుండి వచ్చావ్ బ్రో అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఈగల్’ చిత్రం ఫిబ్రవరి 9 వ తారీఖున విడుదల కాబోతుంది .