washing machine : ఏంటీ రెంట్ 1.35 లక్షలా.. వాషింగ్ మెషిన్ మాత్రం బాత్రూం కమోట్ పైనా పెట్టారా?

washing machine

washing machine

washing machine : ముంబయి సముద్ర తీర నగరం దేశంలోనే అత్యధిక జనాభా ఉండే సిటీ. ఇక్కడ జీవించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. లక్షల జీతం చేసినా కూడా సరిపోని పరిస్థితి. చిన్న చిన్న రూమ్ లతో ఫ్యామిలీలు సర్దుకుని జీవిస్తారు. కొంతమంది అయితే మధ్యాహ్నం ఒకరు. రాత్రి ఒకరు రెంట్ కు ఉంటారు. ఇలా చిన్న చిన్న ఇరుకు సందులు, ముఖ్యంగా దారుణమైన జీవన పరిస్థితుల మధ్య గడుపుతుంటారు.

అయితే ఇన్ స్టా గ్రాంలో ఒక పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.  టు బీహెచ్ కే.. రెండు పడక గదుల ఇండ్లు ఉన్న ఒక రెంట్ హౌస్ లో బాత్రూంలో వాషింగ్ మెషిన్ ఉంచారు. అది కూడా ఎక్కడో తెలుసా? కమోట్ పైన చెబితేనే ఆశ్చర్యపోతున్నారు. చిత్రం చూసిన వారు చేస్తున్న కామెంట్స్ చూస్తే దిమ్మతిరిగి పోతుంది. ఎందుకంటే ముంబయి లైఫ్ లో ఇలాంటి వి కామన్ కూర్చొవడానికే ప్లేస్ ఉండదు.

ఒకే గదిలో నలుగురు లేదా అయిదుగురు అంతకంటే ఎక్కువ మంది జీవిస్తుంటారు. చాలా మందికి ఆ రూమ్ లు కూడా దొరక్క ఫుట్ పాత్ పై జీవితం వెళ్లదీస్తారు. అలాంటిది డబుల్ బెడ్ రూంలో వాషింగ్ మిషన్ ఉందని అది బాత్రూంలో కమోట్ పైన కిటీకి వద్ద పెడితే ఎంటంటా అని ముంబయి సిటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి జీవితాలు, ఇరుకు గదుల్లో ఉండటం మాకు అలవాటే అంటున్నారు.

కానీ చాలా మంది మాత్రం ఈ ఫొటో చూసిన తర్వాత లక్షా ముప్పై అయిదు వేలు పెట్టి ఇంత చిన్న ఇంట్లో ఉండాలా.. దీని కంటే మా హైదరాబాద్ చాల బెటర్.. 50 వేలు పెడితే లగ్జరీ హౌస్, విత్ ఆల్ ఫర్నీచర్ వస్తుందని అంటున్నారు. మనిషి లివింగ్ స్టైల్ కు  హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని కామెంట్స్ చేస్తున్నారు. మాతో కాదురా బాబు ఇలాంటి ఇరుకు ప్లేసుల్లో ఉండటం.

TAGS